G20 Summit : ఢిల్లీ మెట్రో స్టేషన్‎లో ఖలిస్థాన్ నినాదాలు..జీ20 సమావేశాల వేళ టెన్షన్..!!

సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూల నుంచి విదేశీ అతిథులు ఢిల్లీకి రానున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపుతున్నాయి. సిక్కు ఫర్ జస్టిస్ అనే నినాదాలను మెట్రో స్టేషన్ గోడలపై రాసారు. దీనిపై ఢిల్లీ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఏడాది ఢిల్లీలో ఖలిస్తానీ అనుకూల గ్రాఫిటీకి సంబంధించి ఇది రెండో సంఘటన.

New Update
G20 Summit : ఢిల్లీ మెట్రో స్టేషన్‎లో ఖలిస్థాన్ నినాదాలు..జీ20 సమావేశాల వేళ టెన్షన్..!!

G20 Summit : ఢిల్లీలో జీ20 సదస్సు సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న జి 20 సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి విదేశీ అతిథులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో దేశాల జాతీయ అధ్యక్షులు కూడా పాల్గొంటారు. రాజధాని ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమానికి ముందు ఐదుకు పైగా మెట్రో స్టేషన్లలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు మెట్రో స్టేషన్ గోడలపై రాసిన నినాదాలను చెరిపివేసారు.

ఇది కూడా చదవండి: భారీ పేలుడు…8 మంది దుర్మరణం..!!

మెట్రో స్టేషన్ గోడలపై నినాదాలు రాస్తున్న వ్యక్తులకు సంబంధించిన రా ఫుటేజీని SFJ కార్యకర్తలు విడుదల చేశారని, వాటిపై ఖలిస్తానీ అనుకూల నినాదాలను స్ప్రే పెయింటింగ్ చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని...నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న వివరాల ప్రకారం... శివాజీ పార్క్ నుండి పంజాబీ బాగ్ వరకు బహుళ ఢిల్లీ మెట్రో స్టేషన్లలో SFJ కార్యకర్తలు ఉన్నారు.

సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీకి G20 సమ్మిట్ తేదీలను ద్రుష్టిలో ఉంచుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు. G20 సమ్మిట్‌కు ముందు, సిక్కులు ఫర్ జస్టిస్ (SFJ) ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో ఖలిస్తానీ అనుకూల నినాదాలు వ్రాయబడిన రా ఫుటేజీని విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. గోడలపై 'ఖలిస్తాన్ జిందాబాద్', 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' వంటి నినాదాలు రాసి ఉన్న ఢిల్లీ మెట్రో స్టేషన్లలోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గోడలకు పెయింట్ చేసిన నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశామని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ నాయక్‌ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు