Telangana : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. పదవీ విరమణ పై సర్కార్ కీలక నిర్ణయం!

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్‌..61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందు అయితే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

New Update
CM Revanth: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు

Alert For Government Employees : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ(Retirement) కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్‌..61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందు అయితే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీసు, 61 సంవత్సరాల వయో పరిమితి పూర్తైన అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాట్లు చేయాలని రేవంత్‌ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

దీని వల్ల నిరుద్యోగులకు(Un-Employees) భారీ స్థాయిలో మేలు చేకూర్చే అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మార్చి 31 నుంచి రాష్ట్రంలో భారీగా పదవీ విరమణలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలన శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫైల్ ఆమోదం కోసం అధికారులు దానిని సీఎంవోకు పంపారు.

అయితే దీని ఆమోదానికి ఎన్నికల కోడ్(Election Code) అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దానికి ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం ఆ వయో పరిమితి గడువు ముగియడంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. జూన్ 4వవరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.

Also read: ఒంగోలులో టెన్షన్‌..టెన్షన్‌..సద్దుమణగని టీడీపీ,వైసీపీ గొడవలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు