AP News: చంద్రబాబుకు ఏమైనా జరిగితే భువనేశ్వరిపైనే అనుమానం: నారాయణస్వామి ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. చంపుడు రాజకీయాలు మొదలైంది చంద్రబాబు కుటుంబం నుంచే అని, రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారని, ఏదైనా జరిగితే భార్య భువనేశ్వరిపైనే అనుమానం ఉంటుందని అన్నారు. By Vijaya Nimma 21 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని, 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని నారాయణస్వామి అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డీబీటీ ద్వారా ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి జరిగిందా..? అని ప్రశ్నించారు. ఏపీలో జగన్ మౌలిక సదుపాయాలతో కూడిన ఇళ్లను నిర్మిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ఆ స్థలాలపై విష ప్రచారం చేస్తున్నాయని నారాయణస్వామి మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కడా ఇళ్ల నిర్మాణం జరగలేదని, ఇప్పుడు ప్రభుత్వం కడుతున్న ఇళ్లను చూసి కడుపుమంటతో రగిలిపోతున్నారని అన్నారు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనతో పాటు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మద్యం నియంత్రణ ఎన్టీఆర్ చేశారని కొన్ని పత్రికల్లో రాశారని, ఆ తర్వాత అభివృద్ధి కావాలి అంటే మద్యం కావాలని ప్రచారం చేశారని చెప్పారు. ఎక్కడా సింపతీ పెరగలేదు చంద్రబాబు ఇచ్చిన మద్యం బ్రాండ్లు తప్ప తమ ప్రభుత్వం కొత్తగా బ్రాండ్లను తీసుకురాలేదని నారాయణస్వామి చెప్పారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి రావడానికి లాయర్లకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని, రోజుకు రూ.25 కోట్లు అవుతున్నాయని, చంద్రబాబుకు ఈ డబ్బంతా..!! ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అవినీతి అంతంచేసే చట్టం 17Aపై కూడా టీడీపీ నేతలకునమ్మకం లేదని, చంద్రబాబుకు సింపతీ పెరిగిపోయింది అంటున్నారు. కానీ.. ఎక్కడా పెరగలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పతనం కావడానికి ఆయన అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడా మద్యాన్ని నియంత్రించాలని రోడ్డెక్కలేదని నారాయణస్వామి అన్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మహిళలు కూడా జగనన్న పాలనలో సంతోషంగా ఉన్నారని, ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. ఎన్టీఆర్ ఫోటో తీసేసి ఓట్లు అడిగినా.. అదే విధంగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, సీఎం జగన్‌ను తిట్టిన వారినే తిట్టానని, మా నాయకుడిని ఎవరైనా తిడితే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడైనా పది ఇళ్లు కట్టి లే అవుట్ వేసిన చరిత్ర ఉందా అని, చంద్రబాబు అవినీతి పరుడని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని నారాయణస్వామి గుర్తుచేశారు. చంద్రబాబు అవినీతి ఎండగడతా అని పవన్‌కళ్యాణ్ అని ఇప్పుడు మాట మార్చారని, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా..!! మద్దతిస్తామని చెప్పారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్ ఫోటో తీసేసి ఓట్లు అడిగి నాలుగు సీట్లు గెలవమని మంత్రి సవాల్ చేశారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ నియోజకవర్గాలు పూర్తిగా అభివృద్ధి చెందాయని, పుంగనూరులో పోలీసులపై దాడి చేయించింది చంద్రబాబేనని, టీడీపీ నాయకులు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్య.. కాల్చిచంపిన మావోయిస్టులు #tirupathi #ap-minister #key-comments #deputy-cm-narayanaswamy #chandrababu-family మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి