Kesineni Nani : మాజీ మంత్రే భువనేశ్వరిని టికెట్ అడుక్కునే పరిస్థితి.. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే ఇదే: కేశినేని

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు 'బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' అని  కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో లోకేష్ అంటూ ఎద్దేవ చేశారు.

New Update
Kesineni Nani : మాజీ మంత్రే భువనేశ్వరిని టికెట్ అడుక్కునే పరిస్థితి.. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అంటే ఇదే: కేశినేని

Kesineni Nani : ఎన్టీఆర్ జిల్లా(NTR District) నందిగామలో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు, నారా లోకేష్(Nara Lokesh) లపై ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇచ్చిన మాట తప్పి మోసం చేయటమే చంద్రబాబు 'బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' అని కామెంట్స్ చేశారు. బుర్ర లేని లోకేష్ రెడ్ బుక్ లో‌ అధికారుల‌ పేర్లు‌ రాస్తాడంట..నీ రెడ్ బుక్ మడిచి జేబులో లేదా ఎక్కడైనా పెట్టుకో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచికచర్ల మండలం పరిటాలలో జాతీయ నాయకుల విగ్రహాలు, రైతు భరోసా కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వంలో‌ ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) పై అవిశ్వాస తీర్మనాన్ని‌ తన చేత పార్లమెంట్ లో పెట్టించారన్నారు. ఆయనను ఓడించాలని చంద్రబాబు(Chandrababu) ప్రధాని అవ్వాలని కుట్రలు చేశాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ధర్డ్ ఫ్రంట్ అంటూ దేశంలో అన్ని పార్టీల అధినేతలను కలిసి ప్రధాని కావాలని చంద్రబాబు కుట్రలు చేశాడంటూ ఆరోపణలు చేశారు ఎంపీ కేశినేని నాని. మాజీ మంత్రి ఉమ నే.. చంద్రబాబు భార్య భువనేశ్వరిని టికెట్ అడుక్కునే పరిస్థితి వచ్చిందని.. మాజీ మంత్రికే‌ టికెట్ గ్యారెంటీ లేదని వ్యాఖ్యానించారు.

Also Read: మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!

కాగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న కేశినేని.. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వట్లేదని చంద్రబాబు తేల్చి చెప్పడంతో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీలో చేరారు.  కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత(Swetha) కూడా అధికార పార్టీలో కలిశారు. టీడీపీ తనను అనేక సార్లు అవమానించిందని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో టీడీపీ చిచ్చుపెట్టిందన్నారు. చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి అంటూ చాలా సందర్భాల్లో నిప్పులు చెరిగారు. ఇలా వైసీపీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు కేశినేని.

Advertisment
Advertisment
తాజా కథనాలు