Kesineni Nani : టీడీపీకి కేశినేని నాని మరోషాక్‌.. కార్పొరేటర్ పదవికి కుమార్తే రాజీనామా!

విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా పని చేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచిన విషయం తెలిసిందే.

New Update
Kesineni Nani : టీడీపీకి కేశినేని నాని మరోషాక్‌.. కార్పొరేటర్ పదవికి కుమార్తే రాజీనామా!

Swetha Resign : కేశినేని నాని(Kesineni Nani) చుట్టూ బెజవాడ రాజకీయాలు తిరుగుతున్నాయి. విజయవాడ(Vijayawada) ఎంపీగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేశినేని నానికి ఈ సారి టికెట్ దక్కలేదు. ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి టీడీపీ(TDP) హైకమాండ్‌ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఫైనల్‌ చేసింది. ఆ తిరువూరు బహిరంగ సభ కార్యక్రమాలకు నానిని దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ పరిణామాల తర్వాత టీడీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు కేశినేని నాని ప్రకటించగా.. ఇప్పుడు తండ్రి బాటలోనే కూతురు నడవనున్నారు.

కేశినేని కీలక ప్రకటన:
'ఈ రోజు(జనవరి 8) శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది .' అని కేశినేని ట్వీట్ చేశారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ గా పని చేస్తున్నారు కేశినేని శ్వేత(Kesineni Swetha). 2021 మార్చ్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచారమే.

బుజ్జగించినా:
మరోవైపు కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంపీగా తన రాజీనామాను ఢిల్లీ(Delhi) వెళ్లి స్పీకర్‌కు సమర్పిస్తానని కేశినేని ఇప్పటికే ప్రకటించారు. స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కోరారు. ఈ క్రమంలోనే కనకమేడల రవీంద్ర కుమార్‌ని కేశినేని వద్దకు పంపగా.. అప్పటికీ నాని వెనక్కి తగ్గబోనని చెప్పినట్టుగా తెలుస్తోంది. నిజానికి చాలా ఏళ్లుగా కేశినేని చిన్ని-టీడీపీ క్లోజ్‌ అవ్వడాన్ని నాని తప్పుపడుతున్నారు. చిన్నిని దగ్గరకు రానివ్వదంటూ కేశినేని నాని బహిరంగంగానే చంద్రబాబుకు అనేకసార్లు చెప్పారు. చంద్రబాబు స్టేజీపై ఉండగానే కేశినేని నాని ఈ తరహా వ్యాఖ్యలు గతంలో చేశారు. అయితే చిన్ని మాత్రం టీడీపీతో బంధాన్ని పెంచుకుంటూ పోయారు. టీడీపీ కూడా ఎక్కడా చిన్నికి అడ్డు చెప్పలేదు. నారాలోకేశ్‌ యాత్రలో సైతం చిన్నినే అన్నీ దగ్గరుండి చూసుకున్నారు.

ఇక తాను ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తాను ఢిల్లీకి (మళ్లీ ఎంపీగా) వెళ్లడం ఖాయమన్నారు నాని. 'నేను ఒక ఫ్లైట్ మిస్ అయితే, మరో ఫ్లైట్ ఉంది. ఏదైనా విమానంలో సీటు రాకపోతే చార్టర్డ్ ఫ్లైట్ అద్దెకు తీసుకుంటాను.' అని కామెంట్స్ చేశారు. తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని, వారిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని కేశినేని అన్నారు. నియోజకవర్గంలో తాను చాలా పనులు చేశానని, అందుకే ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 'నేను నిరుద్యోగిగా ఉంటే నా ప్రజలు, నా అనుచరులు ఊరుకోరు.' అని చెప్పుకొచ్చారు.

Also Read: అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా..అంబటి రాయుడి వివరణ!

Advertisment
Advertisment
తాజా కథనాలు