Women Tips: మహిళల ఆరోగ్యంలో వ్యక్తిగత పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ భాగాలను శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానమైన అడుగు. అయితే చాలా మంది మహిళలు ఈ విషయంలో కొన్ని సాధారణ తప్పులు చేస్తారు. అవి వారి శరీరంలో బ్యాక్టీరియా పెరగడానికి, ఇన్ఫెక్షన్లు రావడానికి కారణమవుతాయి. అందుకే శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాల్లో ఒకటైన ప్రైవేట్ భాగాల పరిశుభ్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. కేవలం సరైన అలవాట్లతో సహజంగా శుభ్రతను పాటించవచ్చు. ప్రైవేట్ భాగం సహజంగా తన pH స్థాయిని కాపాడుకుంటుంది. కానీ కొన్ని అలవాట్ల వలన ఆ సమతుల్యత దెబ్బతింటుంది.
చెమట వల్ల బ్యాక్టీరియా..
ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయాలంటే గోరు వెచ్చని నీటిని ఉపయోగించడమే ఉత్తమం. రోజులో కనీసం రెండు సార్లు శుభ్రంగా ఉంచాలి. బలమైన సబ్బులు, సెంటెడ్ ఉత్పత్తులు వాడటం వల్ల చర్మానికి నష్టం. ఇవి ఇర్రిటేషన్, ఎలర్జీ, ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. సువాసన గల ఉత్పత్తులు రసాయనాలతో నిండిపోయి ఉంటాయి. ఇవి వాడడం వల్ల శరీరంలో సహజమైన రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది. మరొక ముఖ్యమైన విషయం తడి దుస్తులను ఎక్కువసేపు ధరించకూడదు. స్విమ్‌సూట్‌లు, జిమ్ వేస్ట్‌లు, లేదా వర్షంలో తడిసిన దుస్తులను తొందరగా మార్చకపోతే ఆ భాగాల్లో తేమతోపాటు చెమట వల్ల బ్యాక్టీరియా పెరిగే అవకాశముంటుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాంటప్పుడు వెంటనే పొడి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. బిగుతుగా ఉండే దుస్తులు కూడా సమస్యలకు దారితీస్తాయి. ఇవి వాయు ప్రసరణను అడ్డుకోవడం ద్వారా చర్మం చెమటతో నిండి, ఇన్ఫెక్షన్‌కు అనువైన పరిస్థితిని కలిగిస్తాయి.
ఇది కూడా చదవండి: మహిళలు థైరాయిడ్ బాధితులుగా ఎందుకు మారుతున్నారు?
కాటన్ వంటి సహజమైన మెటీరియల్స్‌తో తయారైన వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. పీరియడ్స్ సమయంలో మరింత శుభ్రత పాటించాలి. ప్యాడ్‌లు లేదా ఇతర శానిటరీ ఉత్పత్తులను తరచూ మార్చడం ద్వారా దుర్వాసన, ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మహిళలు తమ ప్రైవేట్ భాగాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని కాపాడతాయి. అందువల్ల ప్రతి మహిళ ప్రైవేట్ భాగాల శుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం కూడా ముఖ్యం. సహజ మార్గాల్లోనే పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంగా జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వేసవిలో మ్యాంగో షేక్‌ను కొందరు మాత్రం తాగకూడదు
( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )