Raghu Thatha Movie : థియేటర్ రిలీజ్ లేకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి కీర్తి సురేష్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ'రఘుతాత'. ఈ సినిమాను ఆగస్టు 15న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల తెలుగులో కాలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో సెప్టెంబరు 13 నుంచి తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. By Anil Kumar 09 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Raghu Thatha Movie : గత ఏడాది 'దసరా' మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ఇటీవల ఈ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రఘుతాత'. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాకు సుమన్ కుమార్దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని భావించారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా తెలుగులో మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. Get ready for a hilarious family blockbuster!😂💥#RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada.@KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh @tejlabani @mdeii… pic.twitter.com/DpCcA8XfAA — ZEE5 Tamil (@ZEE5Tamil) September 9, 2024 Also Read : ఈ వారం మూవీ లవర్స్ కు పండగే.. ఓటీటీలో ఏకంగా 19 సినిమాలు సెప్టెంబరు 13న తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ వేదిక కొత్త పోస్టర్ను పంచుకుంది. 1960ల కాలం నాటి నేపథ్యంలో మూవీని రూపొందించారు. హిందీ వ్యతిరేక ఉద్యమం, రాజకీయ అంశం చుట్టూ కామెడీ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్. #keerthi-suresh #raghu-thatha-movie సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి