కాంగ్రెస్ కు భయపడే కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు! సీఎం కేసీఆర్ కాంగ్రెస్ కు భయపడే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది కాబట్టి.. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ వరద బాధితులు, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఏంటని భట్టి ప్రశ్నించారు. By P. Sonika Chandra 01 Aug 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి KCR who is afraid of Congress merged RTC into the Government : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(Batti vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్(cm kcr) కాంగ్రెస్(congress) కు భయపడే ఆర్టీసీ(rtc) ని ప్రభుత్వంలో విలీనం చేశారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ..నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టారని ఆయన ఇప్పుడు గుర్తు చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే మాత్రం రోడ్డెక్కుతామని ఆయన హెచ్చరించారు.కాగా, మంగళవారం వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ టీపీసీసీ టీం గవర్నర్(governor) కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల జరిగిన విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్(kcr government) మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల(irrigation projects) వార్షిక మెయింటేనెన్స్ కు నిధులు విడుదల చేయకుండా చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు వరదలు ముంచెత్తి ప్రజలు అల్లాడిపోతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేసినప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేసినందుకే ఇంత పెద్ద నష్టం జరిగిందన్నారు భట్టి. కాళేశ్వరం(kaleswaram), సీతారామ(sitarama) ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడంతోనే అనేక ప్రాంతాలు, గిరిజన గూడేలు ముంపుకు గురయ్యాయన్నారు. మున్నేరు(munneru), కిన్నెరసాని(kinnerasani) నదులపై నిర్మించిన చెక్ డ్యాములు ఇంజినీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి నిర్మాణం చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఇక రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే సీఎం కేసీఆర్ వరద బాధితులు, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ఏంటని భట్టి ప్రశ్నించారు. #tsrtc #batti-vikramarka #kcr-who-is-afraid-of-congress-merged-rtc-into-the-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి