Telangana: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక..

బీఆర్ఎస్‌ఎల్పీ లీడర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్‌ను బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. తలసాని శ్రీనివాస్, కడియం శ్రీహరి బలపరిచారు.

New Update
Telangana: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక..

BRSLP Leader KCR: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభా పక్ష సమావేశంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ పేరును ప్రతిపాదించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. మిగతా సభ్యులంతా ఆయనకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో కేసీఆర్ ఎన్నికకు సంబంధించి వివరాలతో కూడిన లేఖను అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి అందజేయనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 స్థానాల్లో మాత్రమే గెలుపొంది అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఈ 39 మందిలో కేసీఆర్ కూడా ఒకరు. ఆయన కాలు జారి కిందపడటంతో తుంటి ఎముక విరిగింది. యశోధ ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. కేసీఆర్ మరో 6 నుంచి 8 ఎనిమిదివారాలు రెస్ట్ తీసుకోనున్నారు. ఈ కారణంగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇప్పట్లో లేదనే చెప్పొచ్చు. ఇక మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొని.. కేసీఆర్‌ను తమ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరై.. శాసనసభా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also Read:

నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం

పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు