/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T132924.494-jpg.webp)
Kavya Maran : కావ్య పాప ఎట్టకేలకు నవ్వింది. ఐపీఎల్(IPL) లో ఎప్పుడు చూసినా డల్ గా ఫేస్ పెట్టుకొని కనిపించే బ్యూటీ తాజాగా ఎగిరి గంతులేసింది. బాధతో కనిపించే కావ్య బేబీ(Kavya Baby) మొట్ట మొదటిసారి పట్టారని సంతోషంలో మునిగితేలింది. తన సహచరులు, ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా పాప ఫ్యాన్స్ ‘కావ్య పాప నవ్విందోచ్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Madam Kavya Maran on #SunrisersEasternCape 's 2nd title win #OrangeArmy #SA20 #SECvDSG pic.twitter.com/pdIrVr3729
— Sunrisers Army (@srhorangearmy) February 10, 2024
Kavya Maran is over the moon after SEC won their second consecutive SA20 Title last night.#CricketTwitter pic.twitter.com/nuWIwJw88U
— Vibhor (@dhotedhulwate) February 11, 2024
రెండోసారి ఛాంపియన్..
మరి ఆమె అంత సంతోషంగా ఉండడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్(T20 Cricket League) లో ఆమె టీం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో పట్టరాని సంతోషంతో పాప గ్రౌండ్ లోనే గంతులేసింది. అయితే ఫైనల్ మ్యాచ్ స్టార్టింగ్ నుండే ఫుల్ ఖుషీలో ఉన్న ఆమె మ్యాచ్ విన్ అవ్వగానే గ్రౌండ్ లో ఎగిరి గంతులేస్తూ కనిపించింది. దీంతో ఎప్పుడు బాధతో కనిపించే కావ్య పాప నవ్వడంతో ఫొన్, కెమెరాలన్నీ తనవైపు తిరిగాయి. ఐపీఎల్ లో కూడా సన్ రైజర్స్ మ్యాచ్ జరిగితే చాలు.. టీవీ కెమెరా కళ్లతోపాటు క్రికెట్ ఫ్యాన్స్ కళ్లన్నీ కావ్య పైనే ఉంటాయి. అంతలా తమ టీంను పక్కనే ఉండి సపోర్ట్ చేస్తుంది.
Kavya Maran is over the moon after SEC won their second consecutive SA20 Title last night.#CricketTwitter pic.twitter.com/nuWIwJw88U
— Vibhor (@dhotedhulwate) February 11, 2024
ఇది కూడా చదవండి : Telangana: బాల్క సుమన్ కు నోటీసులు.. కేసులకు భయపడనంటున్న మాజీ ఎమ్మెల్యే
ఆదిలోనే ఎదురుదెబ్బ..
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. సన్‌రైజర్స్(Sunrisers) బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ (30 బంతుల్లో 56), అబెల్ (34 బంతుల్లో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. హెర్మెన్, కెప్టెన్ మార్‌క్రమ్‌లో 26 బంతుల చొప్పున ఎదుర్కొని 42 రన్స్ స్కోర్ చేశారు. డర్బన్ బౌలర్లలో కెప్టెన్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టగా, రీస్ టాప్లీ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం 205 పరుగులు ఛేజ్ చేసి.. లీగ్‌లో తొలిసారి టైటిల్ ముద్దాడాలని భావించిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ డర్బన్ జట్టు కోలుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 115 పరుగులకే కుప్పకూలింది. 89 పరుగుల తేడాతో ఓడి.. ట్రోఫీకి దూరమైంది.
Also Read : అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?