MLC Kavitha: కవిత బెయిల్‌పై కేసీఆర్ రియాక్షన్ ఇదే.. కేటీఆర్‌కు ఫోన్ చేసి కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌కు ఫోన్ చేసి విడుదలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. By srinivas 27 Aug 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. 161 రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలియగానే.. కొడుకు కేటీఆర్‌కు ఫోన్ చేసి కవిత విడుదలపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే కూతురు రాకపై కూడా పార్టీ శ్రేణులను కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంబరాల్లో మునిగి తేలిన బీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ ఘనంగా కవితను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కవితకు ఫోన్ కూడా చేయలేదు.. ఇదిలా ఉంటే.. కవిత అరెస్ట్ తర్వాత చాలా ఒత్తిడికి లోనైన కేసీఆర్ ఆమె జైలుకెళ్లిన మొదట్లో లిక్కర్ స్కాం కేసుపై నోరు విప్పలేదు. కనీసం కూతురుకు ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు. కేటీఆర్, హరీశ్ ద్వారా కవిత బాగోగులు తెలుసుకున్నారు. ఆనారోగ్యం కారణంగా కొంతకాలం ఇంటికే పరిమితమైన కేసీఆర్.. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి బిడ్డ అరెస్ట్ పై తనదైన స్టైల్ లో కామెంట్స్ చేశారు. ఎమరికైనా కూతురు అరెస్ట్ అయితే బాధ ఉంటుంది. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇన్నాళ్ల తర్వాత కవిత విడుదలతో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్‌పై రియాక్ట్ అయిన కేసీఆర్.. స్కామ్ అంతా ఉట్టిదేనని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొరికిపోవడంతో బీజేపీ తన కూతురిని ఇరికించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. ఏం జరిగిందంటే.. ఈ మద్యం పాలసీ అమలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు (CBI Enquiry) సిఫారసు చేశారు. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ కింద మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మార్చి 15న కవిత అరెస్ట్.. ఫిబ్రవరి 26న ఢిల్లీలోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ ఇటీవల కవితను కోరింది. అయితే సీఆర్పీసీ సెక్షన్ 41-ఏ కింద జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె దర్యాప్తు సంస్థను కోరారు. నోటీసును రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని అడిగారు. డిసెంబర్ 2022లో తన నివాసంలో సీఆర్పీసీ సెక్షన్ 160 కింద తనను విచారించారని ఆమె గుర్తు చేశారు. తన పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉందని కవిత చెప్పుకొచ్చారు. అయితే దర్యాప్తు సంస్థకు తన నుంచి ఏదైనా సమాచారం అవసరమైతే వర్చువల్‌గా హాజరయ్యేందుకు రెడీగా ఉంటానని కవిత చెప్పేవారు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఈడీ, ఐటీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు చేశారు. మార్చి 15న ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నాటి వారకు ఆమె జైలులో ఉన్నారు. #brs-mlc-kavitha #delhi-liqour-scam #brs-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి