Delhi Liquor Scam: కవిత పీఏలు అరెస్ట్‌.. రేపే విచారణ?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత పీఏల పాత్రపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రేపు కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

New Update
MLC Kavita: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ.. మళ్లీ పొడగిస్తారా ?

MLC Kavitha PA Arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ (ED) అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. కవితను అరెస్టు చేసిన రోజున వీరిద్దరి ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత సహాయకుల పాత్రపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు పంపడంతో రాజేష్ (Rajesh), రోహిత్ రావు (Rohit Rao) బుధవారం విచారణకు హాజరయ్యారు. మరోవైపు కవిత నాలుగవ రోజు విచారణ పూర్తయ్యింది. పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారని తెలిసింది. ఇక ఈడీ కస్టడీలో ఉన్న కవితను మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మోహిత్ బుధవారం కలిశారు.

రేపు రిమాండ్‌ రద్దుపై విచారణ..
ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టులో రేపు కవిత పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారామె. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌, రిమాండ్ ఉత్తర్వులు రద్దు చేయాలని సుప్రీంను కోరారు. ఈడీ తీరును నిరసిస్తూ 537 పేజీల సమగ్ర వివరాలతో కవిత తరపు న్యాయవాదులు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. పిటిషన్‌ ఎల్లుండి విచారణకు రానుంది. మరోవైపు ఈ కేసులో కవితకు విధించిన రిమాండ్ మార్చి 23వ తేదీ ముగియనుంది. ఈ క్రమంలో మరోసారి ఈడీ రౌజ్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ వేస్తుందా? మరోసారి కస్టడీకి కోరుతుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

వాటి చుట్టూనే ప్రశ్నలు..
రోజుకు 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కవిత ఈడీ కార్యాలయంలోని క్యాంటీన్ భోజనమే తింటున్నారు. రోజూ కవితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10,000!

Advertisment
Advertisment
తాజా కథనాలు