Karnataka: అమ్మాయితో మాట్లాడాడని మస్లిం యువకుడిని చితక్కొట్టిన హిందువులు కర్ణాటకలో హిందూ, ముస్లిం గొడవలు ఆగడం లేదు. నిన్నటి వరకు హనుమాన్ చాలీసా వివాదం నడిచింది...ఇప్పుడు హిందూ అమ్మాయితో ముస్లిం యువకుడు మాట్లాడాడని అతన్ని చితక్కొటిన ఘటన అక్కడ సంచలనం రేపుతోంది. By Manogna alamuru 21 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Muslim Young Man Beaten By Bhajarang Dal Group: కర్ణాటకలో హిందూ, ముస్లిం గొడవలు రోజు రోజుకూ ముదురుతుననాయి. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. మొన్న అంతా ఆజాన్ టైమ్‌లో హనుమాన్ చాలీసా విన్నాడని ఒక హిందువును ..ముస్లిమ్‌లు చిక్కిడితే...ఈరోజు అటునుంచి ఇటు రివర్స్ అయింది. హిందువుల అమ్మాయితఓ ముస్లిం అబ్బాయి మాట్లాడాడని...అతన్ని ఎత్తుకెళ్ళి మరీ కుమ్మేశారు. హిందూ అమ్మాయితో మాట్లాడ్డమే నేరం.. కర్ణాటకలోని యాద్‌గిరిలో జరిగిందీ సంఘటన. వాహిద్ రహ్మాన్ అనే 25 ఏళ్ళ విద్యార్ధి మీద బజరంగ్ దళ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. అతను కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా జరిగిందీ ఘటన. వాహిద్ కాలేజీ నేంచి వస్తుండగా తొమ్మది మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు తనను ఎత్తుకుని ఓ గదికి తీసుకెళ్ళారని...అక్కడ ఇష్టం వచ్చినట్టు బాదారని వాహిద్ చెబుతున్నాడు. మొత్తం ఐదు గంటల పాటూ తనను అక్కడే ఉంచి చితక్కొట్టారని అంటుననాడు. దాంతో పాటూ చంపుతామని బెతిరించారని చెబుతున్నాడు. దీనింతటికీ కారణం తాను ఒక హిందువు అయిన అమ్మాయితో మాట్లాడ్డమేనని పోలీసులకు చెప్పాడు వాహిద్. మరొకసారి ఆ అమ్మాయితో మాట్లాడితే ఇంతకంటే ఘోరంగా కొడతామని, ఏకంగా చంపేస్తామని బెదిరించారని చెప్పుకొచ్చాడు. కంప్లైంట్ నమోదు... వాహిద్ ఒంటి మీద దెబ్బలను సైతం చూపిస్తున్నాడు. వీపు నిండా దెబ్బలతో అతను అవస్థలు పడుతున్నాడు. వాహిద్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా పోలీసులు తొమ్మది మంది మీదా కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 307, 323, 341, 342, 363, 504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ప్రస్తుతం నిందితులు అంతా పరారీలో ఉననారు. తొందరలోనే వారిని గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. #karnataka #musilm-student #bhajrang-dal-group #hindu-girl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి