Kebab: కబాబ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. ఇకపై అవి నిషేధం! కబాబ్ లో వినియోగించే ఫుడ్ కలర్స్ పై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కబాబ్‌ల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఇందులో వాడే నాసిరకం కలర్లతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నట్లు గుర్తించింది. కలర్స్ వాడితే జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. By srinivas 25 Jun 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Karnataka: మాంస ప్రియులు ఇష్టంగా తినే కబాబ్(kebab)పై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కబాబ్ లో వినియోగించే ఫుడ్ కలర్స్ పై నిషేధం విధించింది. వెజ్-నాన్ వెజ్ కబాబ్స్‌లో కృత్రిమ రంగులు కలపడం వల్ల ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని తెలిపింది. అలాగే ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కృత్రిమ రంగులపై నిషేధం విధించాం. చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు. కబాబ్‌ల నమూనాలను సేకరించి.. ఈ మేరకు కేరళ రాష్ట్రవ్యాప్తంగా అమ్ముతున్న కబాబ్‌లలో కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ చర్యలకు దిగింది. రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే కబాబ్‌ల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా.. ఇవి నాసిరకంగా ఉన్నాయని గుర్తించి నిషేధం విధించారు. ఇక గతంలో రాష్ట్రంలో అమ్ముతున్న కాటన్ క్యాండీ(పీచు మిఠాయి)లో కలిపే కృత్రిమ రంగుల్లో పేపర్ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగించే రోడమైన్-బి అనే కెమికల్‌ను కలుపుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుందని, అల్సర్ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తూ మార్చిలో పీచు మిఠాయిపై నిషేధం విధించారు. #karnataka #kebabs #food-colors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి