Telangana Election 2023: కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. కొత్తవారికి ఇవ్వడంపై భగ్గుమన్న స్థానిక నేతలు

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి మొద‌లైంది. ఆ పార్టీలో గ‌తంలో ప‌ని చేసిన వారని కాదని కొత్తవాళ్లకు టికెట్‌ ఇవ్వటంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు మండిడుతున్నారు. తాజాగా ప్రక‌టించిన మూడో జాబితాలో అభ్యర్థుల‌ను హైక‌మాండ్ ఖ‌రారు చేసింది.

New Update
Telangana Election 2023: కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు.. కొత్తవారికి ఇవ్వడంపై భగ్గుమన్న స్థానిక నేతలు

Telangana Election 2023: కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ.. ఆందోళన దిగారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కరీంనగర్ నియోజకవర్గంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేందర్‌రెడ్డి పార్టీని బలోపేతం చేశారని ఆయనకు కాకుండా కొత్తగా వచ్చిన బొమ్మకల్ సర్పంచ్ పురమళ్ళ శ్రీనివాస్‌కి టికెట్ కేటాయించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీని బలోపేతం చేయడానికి  కృషి

పార్టీ నేతలు కరీంనగర్ డివిజన్‌లో కరీంనగర్ రూరల్ మండలంలో కొత్తపెళ్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పట్టుకొని ఉన్న మాకు కొత్తగా వచ్చిన వారికి టికెట్లు కేటాయించడంతో ఆవేదన కలుగుతుందన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు పార్టీ టికెట్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ నేతపురమళ్ళ శీనుకు తాము సహకరించాలంటే మమ్మల్ని అందరినీ గుర్తించాలి. మాతో మాట్లాడాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు .

రాజీనామా చేస్తానంటూ వార్నింగ్

మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్లపై ఆ పార్టీలో గ‌తంలో డిప్యూటీ సీఎంగా ప‌ని చేసిన దామోద‌ర రాజన‌ర‌సింహ సీరియన్‌ అయ్యారు. తాజాగా హైక‌మాండ్ ప్రకటించిన జాబితపై తీవ్ర స్థాయిలో అస‌హ‌నం వ్యక్తం చేశారు. త‌న అనుచ‌రులుగా గుర్తింపు పొందిన కాట శ్రీ‌నివాస్ గౌడ్‌, నారాయ‌ణ ఖేడ్ టికెట్‌ను ప‌ట్లోల్ల సంజీవ్‌రెడ్డికి కేటాయించ‌క పోవ‌డాన్ని ఆయన తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. దీనిపై కాంగ్రెస్‌ హైక‌మాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీకి  స్ట్రాంగ్ రాజీనామా చేస్తానంటూ దామోద‌ర వార్నింగ్ ఇచ్చారు.దీంతో విష‌యం తెలుసుకున్న రాష్ట్ర వ్యవ‌హారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే మాజీ డిప్యూటీ సీఎంకు ఫోన్ చేశారు. తొంద‌ర‌ప‌డి ఎలాంటి నిర్ణయం తీసుకోవ‌ద్దని ఆయన కోరారు. స‌మ‌స్యలు వ‌స్తుంటాయ‌ని, అన్నీ స‌ర్దుకు పోతాయ‌ని స‌ర్ది చెప్పే ప్రయ‌త్నం మాణిక్‌రావు ఠాక్రే చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న దామోద‌ర‌ తెలంగాణ ఉద్యమంలో కీల‌క పాత్ర పోషించారు. మొద‌టి నుంచీ కాంగ్రెస్ కండువా క‌ప్పుకుని ప‌ని చేశారు కాబట్టే ఆయనకు బ‌ల‌మైన వ‌ర్గం ఉంది.

ఇది కూడా చదవండి: దయచేసి తిరుమల కళ్యాణ కట్టపై రాజకీయాలు వద్దు.. బోర్డు సభ్యుల విజ్ఞప్తి

Advertisment
Advertisment
తాజా కథనాలు