Lok Sabha Elections: మా ఊరికి ఓట్లు కోసం రాకండి.. నోటాకు ఓట్లు వేస్తాం.. కేరళలోని కన్నూర్‌లో నడువిల్లి గ్రామంలో రోడ్లు సరిగా లేకపోవడంతో అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు రావొద్దంటూ గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే.. ఎన్నికల్లో పాల్గొంటామని లేకపోతే నోటాకు ఓట్లు వేస్తామంటున్నారు. By B Aravind 22 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారాలు సాగుతున్నాయి. కానీ కేరళలోని కన్నూర్‌లో నడువిల్లికి చెందిన గ్రామ ప్రజలు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో ఎవరూ కూడా ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతించమని చెబుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం.. ఆ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉండటమే. నాయకులు సరైన రోడ్లు వేయనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. Also Read: దేశంలో బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కిది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్ మా ఊరికి రావొద్దు అంతేకాదు తమ ప్రాంతానికి ఓట్లు అడిగేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ కూడా రావొద్దంటూ పలు చోట్ల ఫ్లేక్సీలు కూడా ఏర్పాటు చేశారు. నడువిల్లిలో 9,10,11,12 వార్డుల్లోని నాలుగు ప్రధానమైన రోడ్ల పరిస్థితి అధ్వానందా మారింది. రోడ్లు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు అడిగినా కూడా ఏ రాజకీయ పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన రోడ్లు లేక తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అత్యవసర పరిస్థితిల్లో తమ ఊరికి డ్రైవర్లు కూడా రావడం లేదని వాపోతున్నారు. అధికారులకు కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని మండిపడుతున్నారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి గత కొన్నేళ్లుగా నాయకులు అబద్ధపు హామీలు వింటున్నామని.. ఇకనుంచి వారి మాటలను నమ్మమని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే.. లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొంటామని అంటున్నారు. లేకపోతే అందరం నోటాకు ఓట్లు వేస్తామని చెబుతున్నారు. అయితే ఇటీలే రెండు రోడ్లకు నిధులు కేటాయించామని.. వచ్చే ఆర్థిక ఏడాదిలో రహదారి పనులు చేపడతామని పంచాయతీ అధికారులు తెలిపారు. Also Read: రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్: ఈడీ #telugu-news #lok-sabha-elections #kerala-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి