Breaking : మర్డర్ కేసులో 'పోకిరి' రీమేక్ హీరో అరెస్ట్..!

కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యారు. రేణుక స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ మర్డర్ కేసు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Karnataka: హీరో దర్శన్ కు బిగుస్తున్న ఉచ్చు.. ఫామ్‌హౌస్‌ మేనేజర్ ఆత్మహత్య!

Kannada Actor Darshan Arrested In A Murder Case : కన్నడ సినీ ఇండస్ట్రీ (Kannada Cine Industry) లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్ ఈ రోజు ఉదయం మర్డర్ కేసు (Murder Case) లో అరెస్ట్ అయినట్లు సమాచారం. దర్శన్ మైసూరు ఫామ్ హౌస్ లో ఉండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దర్శన్ ఫ్యాన్స్ షాక్ కి గురవుతున్నారు. మర్డర్ కేసులో దర్శన్ అరెస్ట్ అవ్వడం ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

అసలేం జరిగిందంటే...

దర్శన్ కొన్నాళ్లుగా పవిత్ర గౌడ (Renuka Gowda) అనే నటితో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే పవిత్ర గౌడకు రేణుక స్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్ లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేసాడని, పవిత్ర ఈ విషయం దర్శన్ కు చెప్పడంతో దర్శన్ రేణుక స్వామి (Darshan Renuka Swamy) ని మర్డర్ చేయించినట్లు తెలిసింది. ఈ మర్డర్ లో ఇప్పటికే కొంతమంది పోలీసులకు దొరకగా వాళ్ళు దర్శన్ చెప్తేనే చేసినట్టు, తమకు ఏం తెలీదని చెప్పారు.

Also Read : నేను, బాలయ్య సెట్ లో ఆ పని చేసేవాళ్ళం.. ‘NBK109’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న చాందిని చౌదరి!

ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ మర్డర్ కేసు గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా దీనిపై ఇప్పటివరకు హీరో దర్శన్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్పందించలేదు. ఇక గత ఏడాది దర్శన్ 'కాటేరా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మళయాలంలో ప్రభాస్ 'సలార్' మూవీకి పోటీగా వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు