/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-24T171758.868-jpg.webp)
Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ప్రేమ వ్యవహారం గురించి ఓపెన్ అయింది. కొంతకాలంగా ప్రముఖ వ్యక్తితో కంగన (Kangana Ranaut) డేటింగ్ చేస్తున్నట్లు వార్తలోస్తున్న విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా అయోధ్యలో (Ayodhya) బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై సందడి చేసింది. ఈ క్రమంలోనే అక్కడొక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో అతనే తన ప్రియుడు అంటూ నెటిజన్లు నానా హంగామా చేస్తున్నారు. దీంతో వెంటనే స్పందించిన నటి లవ్ లైఫ్ గురించి క్లారిటీ ఇచ్చింది.
Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3
— Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024
నిషాంత్‌కు పెళ్లైంది..
ఈ మేరకు ఈజ్ మై ట్రిప్ (EaseMyTrip) వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి (Nishant pitti)తో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరగడం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పింది. 'నిషాంత్ తో ప్రేమలో ఉన్నాననే వార్తలన్నీ వదంతులు మాత్రమే. దయచేసి ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. నిషాంత్‌కు పెళ్లైంది. ఆయన భార్యతో సంతోషంగా గడుపుతున్నారు. కాబట్టి అతని వైవాహిక జీవితాన్ని డిస్ట్రబ్ చేయొద్దు' అని కోరింది.
Main kaisi lag rahi hoon ? pic.twitter.com/ahbSu1jZga
— Kangana Ranaut (@KanganaTeam) January 13, 2024
ఇది కూడా చదవండి : RTVలో బిగ్ బాస్ రచ్చ.. లైవ్ లో కొట్లాడిన స్వప్నా చౌదరి, తమ్మలి రాజు
ప్రేమలో ఉన్నది నిజమే..
అలాగే తాను మరో వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు చెబుతూ.. 'ఇది అనౌన్స్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటోలు దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మాట్లాడటం విజ్ఞత కాదు. మళ్లీ ఇలా చేయరని కోరుతున్నా’ అని చెప్పుకొచ్చింది కంగన.