Kammam: లంచగొండి పోలీస్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన హెడ్‌ కానిస్టేబుల్‌

ఖమ్మం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పగడాల కోటేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఆస్తి వివాదాల కేసులో పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారినుంచి రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. బాధితులు ఏసీబీనీ ఆశ్రయించి అతన్ని పట్టించారు.

New Update
Kammam: లంచగొండి పోలీస్.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన హెడ్‌ కానిస్టేబుల్‌

Bribe: బాధితుల నుంచి లంచం (Bribe) తీసుకుంటూ ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ (Head constable) అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఖమ్మం (Kammam) నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పగడాల కోటేశ్వరరావు 2022 సంవత్సరంలో ఓ కుటుంబ ఆస్తి వివాదాల కారణంగా బుర్ల రామారావు కూతురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

publive-image

ఆస్తి వివాదాలు..
ఈ కేసు విషయంలో హైకోర్టులో ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసే విషయంలో హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు (Koteswara rao) రూ. 50 వేలు లంచం డిమాండ్‌ చేశాడు.

ఇది కూడా చదవండి : UP: భర్త అసహజ శృంగారం.. విసిగిపోయి అది కొరికేసిన భార్య

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా సోమవారం ఏసీబీ డీఎస్పీ రమేష్ బుర్ల రామారావు కొడుకు విష్ణు చేతుల మీదుగా తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు దాడి చేసి హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు