Kamal Haasan : వయోనాడ్ బాధితుల కోసం కమల్ హాసన్ భారీ విరాళం..! తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ వయోనాడ్ బాధితుల కోసం ముందుకొచ్చారు. ఈ మేరకు బాధితుల కోసం కమల్ రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ భారీ మొత్తాన్ని ఆయన కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసినట్లు సమాచారం. By Anil Kumar 03 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Kamal Haasan : కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల 300 వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో వందల సంఖ్యల్లో ప్రజలు గాయాలపాలయ్యారు. కూలిపోయిన భవనాలు శిథిలాల కింద ప్రాణాలతో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి పలువురు సినీ తారలు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయం చేస్తున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ రూ.35 లక్షలు, హీరో సూర్య, కార్తీ ఫ్యామిలీ రూ.50 లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందించారు. Also Read : వైజాగ్ లో ‘డబుల్ ఇస్మార్ట్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడంటే? తాజాగా ఈ లిస్ట్ లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సైతం చేరారు. వయోనాడ్ బాధితుల కోసం కమల్ రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ భారీ మొత్తాన్ని ఆయన కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసినట్లు సమాచారం. కాగా ఇటీవల 'కల్కి' మూవీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్న కమల్.. ప్రస్తుతం 'థగ్ లైఫ్' సినిమా చేస్తున్నారు. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. #kamal-haasan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి