/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T190157.313.jpg)
Kamal Haasan, Rishab Shetty : హీరోలు (Hero's), క్రికెటర్లు (Cricketers) ఒకే వేదికపై కలవడం కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ (IPL 2024) సీజన్ లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓ క్రికెటర్ హీరోని కలిసినా, ఓ హీరో తన అభిమాన క్రికెటర్ తో ఫోటో దిగినా అభిమానులు వాటిని సోషల్ మీడియాల్లో షేర్ చేసి తెగ సంబరపడిపోతుంటారు.
తాజాగా తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ (Kamal Hassan), కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) శనివారం చెన్నై, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్ ని చూసేందుకు వచ్చారు. కమల్ హాసన్ తన కొత్త సినిమా ఇండియన్ 2 ప్రమోషన్స్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ కి వచ్చి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.\
Also Read : అయ్యయ్యో.. ధోనీ కొట్టిన ఆ సిక్స్ చెన్నై కొంప ముంచేసింది!
ఈ క్రమంలోనే తన అభిమాన క్రికెటర్ ధోని (Dhoni) పై ప్రశంసలు కురిపించారు. అతడి జర్నీ ఓ స్ఫూర్తిదాయకం అని అని అన్నారు. మరోవైపు ఇదే మ్యాచ్ ను చూసేందకు వచ్చిన కాంతారా హీరో రిషబ్ శెట్టి వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ని కలిసి ఫొటో దిగారు.
ఆ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..'ఐపీఎల్ మ్యాచ్ ని నేరుగా స్టేడియంలో కూర్చొని చూడటం ఇదే ఫస్ట్ టైం' అని పేర్కొన్నాడు. దీంతో ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ సూపర్, పర్ఫెక్ట్ పిక్చర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram