Kalki 2898 AD: రికార్డులు బద్ధలే..ప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీ ఫీవర్

ప్రపంచవ్యాప్తంగా కల్కీ మూవీ ఫీవర్‌ పట్టి కుదిపేస్తోంది. మొదటిరోజే రికార్డ్‌లను బద్దలు చేస్తోంది. USతో సహా అన్ని దేశాల్లో మూవీకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీని మించి కలెక్షన్లను సాధించిందని చెబుతున్నారు.

New Update
Kalki 2898 AD: రికార్డులు బద్ధలే..ప్రపంచ వ్యాప్తంగా కల్కి మూవీ ఫీవర్

తొలిరోజే కల్కి 2898 ఏడీ రికార్డులు బ్రేక్ చేస్తోంది. US సహా ఓవర్సీస్‌లో కల్కీకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. విడుదలైన ప్రతిచోట హౌస్‌ ఫుల్‌ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ రూ.200 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా.తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్‌ సినిమాగా కల్కీ రికార్డు సృష్టించిందని ఫిల్మ్ పండితులు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఫస్ట్ వీకెండ్‌ రూ.500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇండియాలో కల్కి మూవీ తొలి రోజే రూ.120-140 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఇదే రికార్డని చెప్తున్నారు సినీ విశ్లేషకులు. బాహుబలి, RRRను మించిన ఫస్ట్ డే కలెక్షన్లను కల్కి మూవీ రాబట్టింది అని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ 3.46 మిలియన్ డాలర్లు రాబడితే...ప్రభాస్ కల్కి మూవీ 3.7 మిలయ్ డాలర్లు సంపాదించుకుంది. వీకెండ్‌లో ఇది ఇంకా పెరుగుతుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు విశ్లేషకులు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం చేసిన కల్కి 2898ఏడీ మూవీలో ప్రభాస్, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. ఈ పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ నిర్మించారు.

Also Read:Andhra Pradesh: ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు చిక్కిన చిరుత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మహేష్ చేతిలో దర్శనమిచ్చిన పాస్‌పోర్టు.. వెకేషన్‌కు పర్మిషన్ ఇచ్చిన రాజమౌళి

SSMB29 మూవీ షూటింగ్ కోసం మహేష్ పాస్‌పోర్టును రాజమౌళి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పాస్‌పోర్టును రాజమౌళి తిరిగి ఇచ్చేశాడని మహేష్ ఎయిర్‌పోర్టులో చూపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫైనల్‌గా వెకేషన్‌కు రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడని అంటున్నారు.

New Update
Mahesh passport video

Mahesh passport video Photograph: (Mahesh passport video)

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగజం రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. షూటింగ్ కోసం రాజమౌళి మూడు నెలల క్రితం పాస్‌పోర్టు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఇప్పుడు మహేష్‌కి పాస్‌పోర్టు ఇచ్చారు. ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్తున్న మహేష్ పాస్‌పోర్టును ఫొటోగ్రాఫర్లకు ఎయిర్‌పోర్టులో చూపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ని రోజులకు రాజమౌళి మహేష్‌కు ఫ్రీడమ్ ఇచ్చారని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

ఇది కూడా చూడండి: Earthquake: మరోసారి భూకంపం.. బయటకు పరుగులు తీసిన ప్రజలు- ఈసారి ఎక్కడంటే?

Advertisment
Advertisment
Advertisment