Kalki Movie Review : ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు.. ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్

ఎన్నో రోజులుగా ఊరిస్తున్న కల్కి సినిమా మొత్తానికి విడుదల అయింది.ఇప్పటివరకు ఫ్లాప్ ఇవ్వని దర్శకుడు ఒకవైపు, పాన్ ఇండియా స్టార్ ఇంకోవైపు,పెద్ద స్టార్లు మరోవైపు..చాలా అంచనాలతో విడుదల అయింది కల్కి 2898ఏడీ మూవీ.దీనిపై RTV అందిస్తున్న స్పెషల్‌రివ్యూ ఈ ఆర్టికల్ లో చూడండి.

New Update
Kalki Movie Review : ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళాడు.. ట్విస్ట్‌లతో అదరగొట్టిన నాగ్ అశ్విన్

Kalki 2898AD : ప్రభాస్ (Prabhas), అమితాబచ్చన్, దీపికా పడుకోన్ (Deepika Padukone), కమల్ హసన్ (Kamal Hassan) ఇలా అందరూ పెద్ద పెద్ద స్టార్‌ లు ఉన్నారు. ఇప్పటి వరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు, క్లాసిక్, వెరైటీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నాగ్ అశ్విన్ (Nag Ashwin) తీసిన సినిమా కల్కి 2898ఏడీ మూవీ విడుదల అయింది. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రానుంది. మొదటి పార్ట్ ఈరోజు వరల్డ్‌వైడ్‌గా విడుదల అయింది. సలార్‌ తర్వాత మరో భారీ  హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్‌కు మరి ఆ రేంజ్ లో హిట్ దక్కిందా? పురాణాలు, ఫ్యూచర్‌ను కలిపి తీశానని చెబుతున్న నాగ్ అశ్విన్ తెలుగు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాడా లేదా.. తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాలి.

కథ..

మహాభారతంతో మొదలై... ప్రస్తుతం నడుస్తున్న ప్రపంచం కొంతకాలం తర్వాత అంతం అయిపోయి.. ఎవరో కొద్దిమంది మిగిలి ఉంటారు. వారు పడుతున్న కష్టాలు, ఒక రాక్షసుడు పేద ప్రజల మీద చెలాయిస్తున్న అధికారం...అక్కడి నుంచి తప్పించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు..మధ్యలో దేవుడు ఆవిర్భావిస్తాడు అని చెప్పడం...గర్భంలో ఉన్న దేవుడిని కాపాడాటానికి చేసే ప్రయత్నాలతో కథ నడుస్తుంది. పురాణ పాత్రలను, ఇప్పటి ప్రజలను కలుపుతూ తీసిన సినిమా కల్కి. మహాభారతంలో అశ్వత్థామ చిరంజీవి అని చెబుతారు. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ను బేస్‌ చేసుకుని అల్లుకున్న కథ ఇది.

ఎలా ఉంది...

సినిమా తీస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ కల్కి మూవీ మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. మూవీ షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచీ విపరీతమై హైప్ వచ్చింది. పెద్ద పెద్ద తారలందరూ ఇందులో నటించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్నిచోట్ల నుంచి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. నాగ్ అశ్విన్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కల్కి. ఈ మూవీ దర్శకుడు నాగ్‌ అశ్విన్ ఈ సినిమా కథేంటో చెబుతూనే ఉన్నాడు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు కూడా ఇందులో ఉండే లోకాల గురించి చెప్పేశాడు. కాశీ, కాంప్లెక్స్, శంభాల అనే నగరాల మధ్య జరిగే కథే కల్కి మూవీ. సినిమా మొదలెట్టడం మహాభారతంతో మొదలెట్టాడు దర్శకుడు. మహభారతంలో ఉండే అశ్వత్థామ ప్రస్తుత ప్రపంచంలోకి ఎలా వచ్చాడు అనే దాన్ని మొదట్లోనే చెప్పేశాడు. అక్కడి నుంచి డైరెక్ట్‌గా భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. మహాభారతం ఇంట్రడక్షన్ అయిపోయాక..ఏకంగా వరల్డ్‌ ఎండ్‌కు వెళ్ళిపోయాడు. ప్రపంచం అంతా అంతం అయిపోయి ఒక్క కాశీ నగరమే మిగిలింది అన్న దగ్గర అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి మనుషులు మనుగడ కోసం ఎలా పాట్లు పడుతున్నారు. అక్కడే ఉన్న కాంప్లెక్స్ అనే మరో మహానగరానికి వెళ్ళడానికి ప్రజలు ఎలా ప్రయత్నిస్తున్నారు. మధ్యలో శంభాల వీరులు కాశీ ప్రజలను కాపాడాటానికి కి, ప్రపంచాన్ని కాపాడాటానికి చేసే ప్రయత్నాలు ఇలాంటి వాటితో సినిమా అంతా నడుస్తుంది. కాంప్లెక్స్ సిటీని ఒక రాక్షసుడు పరిపాలిస్తుంటాడు. అతను ఒక మహాశక్తి కోసం ఎదురు చూస్తుంటాడు. హీరో ప్రభాస్ కూడా కాశీలోనే ఉంటూ కాంప్లెక్స్‌కు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు.

మొదటి హాప్ అంతా ఇబ్బడిముబ్బడిగా వచ్చే పాత్రలను పరిచయం చేయడానికే సరిపోయింది. మొత్తం మూడు గంటల పదినిమిషాల సినిమాలో గంటన్నర మొదటి హాఫ్. ఇందులో క్యారెక్టర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలామంది ఊహించని నటులందరూ ఈ హాఫ్‌లోనే కనిపిస్తారు. సినిమా షూటింగ్ మధ్యలో వచ్చిన గాసిప్స్ అన్నీ నిజం చేస్తూ కల్కి మూవీలో చాలామంది పెద్ద నటులున్నారు. ఇలా నటులను పరిచయం చేయడానికే ఫస్ట్ హాప్‌ అంతా తీసుకోవడంతో కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కథ కూడా నెమ్మదిగా నడిచిన ఫీల్ వస్తుంది. కానీ ఇంటర్వెల్ వచ్చేసరికి కథ ఒక గాడిన పడతుంది. అన్ని క్యారెక్టర్లకు ఉన్న లింక్‌ను నెమ్మదిగా ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి కథ పరుగెడుతుంది. సెకండ్‌ హాఫ్‌ ప్రభాస్, అమితాబ్ బ్చన్, దీపికా పడుకోన్ ప్రధానంగా సాగుతుంది. దీపికా పడుకోన్‌ను కాపాడ్డానికి అమితాబ్, ఎత్తుకెళ్లడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలు...దాని వెనుక కథ..మధ్యలో శంభాల ప్రజలకు...దీపికాకు ఉన్న రిలేషన్...వాళ్ళు ఎందుకు ఆమెను కాపాడుతుంటారు అనేది ఉంటుంది. ఇందులోనే బోలెడు పోరాట సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య ఉన్న ఫైటింగ్స్ అలరిస్తాయి. దాంతో పాటూ మూవీ అంతా వీఎఫ్ఎక్స్‌ అద్భుతంగా ఉంది. హాలీవుడ్ స్థాయికి ఎక్కడా తగ్గకుండా మూవీ తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మార్వెల్ డ్యూన్ సినిమాలకు సమానంగా కల్కి మూవీ తీశారనే చెప్పొచ్చు. కథకు తగ్గట్టు గ్రాఫిక్స్ అతికినట్టు సరిపోయాయి. ప్రభాస్ వాడే బుజ్జి వాహనంతో పాటూ సినిమాలో వాడిన వాహనాలు, ఆయుధాలు అన్నీ చాలా వెరైటీగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఇవి కొత్తగా అనిపిస్తాయి.

ఇక మూవీ చివరలో వచ్చే ట్విస్ట్‌లు అయితే అదిరిపోతాయి. ఒక్కో క్యారెక్టర్ అసలు స్వరూపం తెలుస్తుంటే మూవీలో మజా వస్తుంది. మొదటి హాఫ్‌లో కాస్త బోర్ కొట్టించినా...సినిమా చివర వరకు ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో...తరువాత ఏమవుతుంది అనే క్యూరియాసిటీని కలిగించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అసలు ఇంతకీ దీపికా పడుకోన్‌ ఎవరు? కమల్ హసన్ క్యారెక్టర్ ఏంటి? హీరో ప్రభాస్ మంచివాడా, చెడ్డవాడా?...కథలో అన్ని క్యారెక్టర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని తెలుసుకోవాలంటే మాత్రం కల్కి సినిమా చూడాల్సిందే. త్రీడీ, ఫోర్డీల్లో కూడా విడుదల అయింది. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో ఇంకా బాగుంటుందని చెబుతున్నారు ప్రేక్షకులు.

రేటింగ్..3.5/5

Advertisment
Advertisment
తాజా కథనాలు