Kalki 2898AD : 'కల్కి' కి అరుదైన గౌరవం.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా!

ప్రభాస్ 'కల్కి 2898AD' మూవీకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్‌ ప్రీమియర్ కానుంది. అక్కడ ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26నే మొదటి ప్రీమియర్ స్టార్ట్‌ కానుంది.

New Update
Kalki 2898AD : 'కల్కి' కి అరుదైన గౌరవం.. అక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతున్న రెండో సినిమాగా!

Kalki 2898AD' Movie Got A Rare Honor : ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898AD' మూవీకి అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్‌ ప్రీమియర్ కానుంది. కల్కి వరల్డ్ వైడ్ గా ఈనెల 27న విడుదల కానుంది. అయితే, ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే అంటే జూన్ 26నే మొదటి ఆట పడనుంది.రాత్రి 8.30 గంటలకు మొదటి ప్రీమియర్ స్టార్ట్‌ కానుంది.

అక్కడ ఒక సినిమా ప్రీమియర్‌ షో పడటం చాలా అరుదు. గతంలో తెలుగు నుంచి 'RRR' మూవీని ఇక్కడ ప్రదర్శించారు. ఇక ఈ లిస్ట్ లో రెండో సినిమాగా ప్రభాస్ 'కల్కి' చేరడం విశేషం. ఇక నిన్న రాత్రి రిలీజైన 'కల్కి' ట్రైలర్ సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతుంది. ఈ ట్రైలర్ అంచనాలకు మించి ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్లో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

Also Read : ‘సికందర్‌’ కోసం సల్మాన్ భారీ సాహసం.. ఏకంగా 33,000 అడుగుల ఎత్తులో ఫైట్!

కల్కి ట్రైలర్ చూస్తున్నంత సేపు ఓ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ని చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఆ రేంజ్ లో విజువల్స్ ఇంప్రెస్ చేశాయి. ఇక భైరవ పాత్రలో ప్రభాస్ యాక్షన్, డైలాగ్స్ అదరగొట్టేసారు. సంతోష్ నారాయణన్ బీజీఎం ట్రైలర్ మొత్తానికి హైలెట్ అని చెప్పొచ్చు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు