Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. 'కల్కి' ఐమ్యాక్స్ స్క్రీనింగ్స్ రద్దు!

'కల్కి 2898 AD' హిందీ వెర్షన్‌కు సంబంధించి కెనడాలో 15 ఐమ్యాక్స్‌ షోలు ఊహించని విధంగా రద్దయ్యాయి. మొదట ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. కానీ క్యాన్సిల్ అయింది కెనడాలో అని తెలిసి ఇక్కడి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

New Update
Kalki 2898AD : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. 'కల్కి' ఐమ్యాక్స్ స్క్రీనింగ్స్ రద్దు!

Kalki 2898 AD Movie Imax Screening Cancel : ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహాభారం లోని కొన్ని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్‌ జోడీంచి నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్‌ సాంగ్‌ సినిమాపై అంచనాలు పెంచేసాయి. మరికొద్ది గంటల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలింది.

ఐమ్యాక్స్ స్క్రీనింగ్ రద్దు..

'కల్కి 2898 AD' హిందీ వెర్షన్‌కు సంబంధించి 15 ఐమ్యాక్స్‌ షోలు ఊహించని విధంగా రద్దయ్యాయి. అయితే ఇది ఇండియాలో కాదు. ఓవర్సీస్ లో అని తెలుస్తోంది. కెనడాలో కల్కి హిందీ వెర్షన్‌ ఐమ్యాక్స్‌ షోలు క్యాన్సిల్ అయ్యాయట. మొదట ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.కానీ క్యాన్సిల్ అయింది కెనడాలో అని తెలిసి ఇక్కడి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : ‘కల్కి’ తో నాగ్ అశ్విన్ ఆడియన్స్ కు చెప్పబోయేది ఇదేనా? ఇంతకీ ఇందులో ‘కలి’ ఎవరంటే?

కెనడాలో మినహా మిగిలిన అన్ని అంతర్జాతీయ కేంద్రాల్లో ఐమ్యాక్స్‌ స్క్రీనింగ్స్‌ యదావిధిగా కొనసాగనున్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో వస్తోన్న ఈ మూవీ ఐమ్యాక్స్‌, 4dx, 3D ఫార్మాట్లలో సైతం ప్రదర్శితం కానుంది. మరోవైపు 'కల్కి' అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కల్కి టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ బుకింగ్స్ చూస్తుంటే 'కల్కి' బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు