Kaleshwaram Fight : వాటర్ వార్.. నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటి..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మార్చి 6న తెలంగాణకు రానుంది. హైదరాబాద్‌లో అధికారులతో భేటీ తర్వాత మార్చి 7, 8న బ్యారేజీలను పరిశీలించనుంది. సమస్యను పరిష్కరించడానికి చర్యలు సూచిస్తుంది.

New Update
Kaleshwaram Fight : వాటర్ వార్.. నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటి..!

Kaleshwaram Project Row : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(KLIS) మూడు బ్యారేజీల డిజైన్, నిర్మాణాన్ని పరిశీలించడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్(Congress) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ కమిటీ ఇవాళ(మార్చి 6) అన్నారం, మేడిగడ్డ(Medigadda), సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించడానికి నిపుణుల కమిటీ వస్తుండడంతో అటు పోలిటికల్‌గా దీనిపై రగడ నెలకొవడం ఖాయంగా కనిపిస్తోంది. దర్యాప్తు బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్‌డీఎస్‌ఏ సిఫార్సులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

బ్యారేజీల దుస్థితిని పరిశీలించనున్న కమిటీ:
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు మునిగిపోవడానికి గల కారణాలపై కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ విచారణ జరుపుతుంది. అన్నారం, సుందిళ్ల రెండు అప్‌స్ట్రీమ్ బ్యారేజీల దుస్థితిని పరిశీలిస్తుంది. విజిట్ తర్వాత కమిటీ మూడు బ్యారేజీల సమస్యను పరిష్కరించడానికి చర్యలు సూచిస్తుంది. తదుపరి అధ్యయనాలు/పరిశోధనలను సిఫార్సు చేస్తుంది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించడానికి చర్యలను కూడా సిఫార్సు చేస్తుంది.

ఇక మేడిగడ్డ బ్యారేజీ పైర్లు మునిగిపోవడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు జరిగే నష్టాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరడంతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. గతేడాది అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్‌డీఎస్‌ఏ బృందం వెంటనే నీటిని ఖాళీ చేయాలని సిఫారసు చేసింది. సుందిళ్ల, అన్నారం బ్యారేజీల తనిఖీల తర్వాత సమస్యలను గుర్తించి వాటిని ఖాళీ చేయాలని ఆదేశించింది. NDSA ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసింది.

వారికి సాంకేతిక పరిజ్ఞానం లేదు: ఉత్తమ్
అయితే ఆ బ్యారేజీలను నీటితో నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్(BRS) నేతలు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఫైర్ అవుతున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులకు సాంకేతిక పరిజ్ఞానం లేదని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత, నిర్వహణ, నిర్మాణం, డిజైన్‌ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలను తుంగలో తొక్కిందని విమర్శించారు.

Also Read : వారికి రైతుబంధు కట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు