🔴Kaleswaram Project CAG Report: కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం కాగ్ నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాగ్ నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాళేశ్వరం గురించి భారీగా ఖర్చు పెట్టారు కానీ..పూర్తి ప్రయోజనాలు జరగలేదని కాగ్ లో ఉంది. రీ ఇంజినీరింగ్‌, మార్పుల కారణంగా రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.

New Update
🔴Kaleswaram Project CAG Report: కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం కాగ్ నివేదిక

Kaleshwaram Project CAG Report  in Telangana Assembly

  • Feb 15, 2024 12:34 IST
    ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకున్నారు.

    కాళేశ్వరం కోసం బారీగా రునాలు తీసుకున్నారు. 15 బ్యాంకులతో 87వేల కోట్లు సమకూర్చుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. బడ్జెటేతర రుణాలపై  బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఆధారపడింది. రుణాలు చెల్లించడంలో కాలయాపన చేసింది.



  • Feb 15, 2024 12:21 IST
    వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి 

    కాళేశ్వరం డీపీఆర్‌ తయారు చేసిన వ్యాప్కోస్ పని తీరులో లోపాలు ఉన్నాయి. అయినా  రీఇంజనీరింగ్ పనులు కూడా అదే సంస్థకు అప్పగించారు.



  • Feb 15, 2024 12:16 IST
    రుణాలు కట్టడం కోసం మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి.

    కాళేశ్వరం అప్పు కట్టుకుంటూ పోతే 2036లో పూర్తవుతుంది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ. ఆయకట్టు 52 శాతం మాత్రమే పెరిగింది . దాని వలన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు వడ్డితో సహా 1,47,427 కోట్లకు పెరిగింది.



  • Feb 15, 2024 11:53 IST
    ప్రాణహిత ప్రాజెక్టు డీపీఆర్‌ లేదు 

    ప్రాజెక్టు పనుల్లో మార్పుల కారణంగా కొన్ని పనులు నిరార్థకం అయ్యాయి.. ఫలితంగా 767 కోట్లు నష్టం వాటిల్లింది.



  • Feb 15, 2024 11:44 IST
    భారీ వడ్డీల భారం.. 

    కేఐసీసీఎల్ రుణాలపై ఏటా 7.8 శాతం నుండి 10.9 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్న కాగ్



  • Feb 15, 2024 11:43 IST
    కేఐసీసీఎల్ ద్వారా భారీగా రుణాలు 

    ప్రాజెక్టు నిధులు సమకూర్చుకోవడం కోసం కేఐసీసీఎల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన  హామీలతో కేఐసీసీఎల్ ద్వారా రూ.87,449 కోట్ల రుణాలు సమీకరించినట్టు వెల్లడించిన కాగ్ 



  • Feb 15, 2024 11:42 IST
    ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే ప్రాజెక్టుకు నిధులు?

    కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకున్నారో.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు అని తేల్చిన  కాగ్



  • Feb 15, 2024 11:41 IST
    2022  మర్చి నాటికి అనుమతులు 

    కాగ్ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి మొత్తం రూ.లక్షా 10వేల 248 కోట్లు అనుమతులు ఇచ్చారు



  • Feb 15, 2024 11:39 IST
    అనుమతులన్నీ ఒకేసారి ఇవ్వలేదు 

    కాళేశ్వరం ప్రాజెక్టు అంచానాల అన్నిటికీ కలిపి ప్రభుత్వం ఓకేసారి అనుమతి ఇవ్వలేదు. విడతల వారీగా ఒక్కో పనికీ విడివిడిగా అనుమతులు జారీ చేశారని తేల్చిన కాగ్ నివేదిక 



  • Feb 15, 2024 11:37 IST
    కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం

    కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81,911 కోట్లుగా పేర్కొన్న కాగ్



  • Feb 15, 2024 11:36 IST
    ఆరువేల కోట్లకు పైగా ఖర్చు 

    50టీఎంసీల సామర్ధ్యం..  రూ.6వేల 126 కోట్లతో  మల్లన్న సాగర్ నిర్మించారని చెప్పిన కాగ్ 



  • Feb 15, 2024 11:35 IST
    మల్లన్న సాగర్ కు భూకంపాల బెడద 

    మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో భూకంపాలపై లోతైన అధ్యయానాలేవి నిర్వహించకుండానే ప్రాజెక్ట్ నిర్మించారని చెప్పిన కాగ్ రిపోర్ట్



  • Feb 15, 2024 11:33 IST
    మల్లన్నసాగర్ ప్రాంతంలో ఫాల్ట్ 

    ఎన్జీఆర్ఐ ఆధ్యయనంలో మల్లన్న సాగర్  ప్రాజెక్టు నిర్మించే ప్రదేశంలో డీప్ సీటెడ్ వెర్డికల్ ఫాల్ట్ ఉందని పేర్కొన్నట్లు కాగ్ వెల్లడి 



  • Feb 15, 2024 11:32 IST
    కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు సరికాదు 

    కొమరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదించిన ప్రదేశం అనుకూలంగా లేదన్న కాగ్.. 



  • Feb 15, 2024 11:27 IST
    అదనంగా నిర్వహణ ఖర్చులు కూడా..  

    విద్యుత్ ఖర్చులతో పాటు అదనంగా నిర్వాహణ ఖర్చు రూ.272 కోట్లు అవుతున్నట్లు కాగ్ వెల్లడి. మొత్తం ప్రాజెక్ట్ నిర్వాహణ ఖర్చు ఏడాదికి రూ.10వేల 647 కోట్లుగా చెప్పిన కాగ్ 



  • Feb 15, 2024 11:26 IST
    భారీగా విద్యుత్ ఖర్చు 

    కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటా విద్యుత్ చార్జీల కోసం రూ.10వేల 374 కోట్లు ఖర్చు అవుతున్నట్లు కాగ్ నివేదికలో వెల్లడి



  • Feb 15, 2024 11:24 IST
    ప్రాజెక్ట్ ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారు. 

    కాళేశ్వరం ప్రాజెక్టుతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపించారని చెప్పిన కాగ్



  • Feb 15, 2024 11:23 IST
    వేల కోట్ల నుంచి లక్ష కోట్లకు భారీగా పెరిగిన వ్యయం.. 

      రూ.63వేల352 కోట్ల నుంచి రూ. లక్షా 2వేల 267 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్న కాగ్



  • Feb 15, 2024 11:22 IST
    ప్రతిపాదనల కంటే ఎక్కువ ఖర్చు

    ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందు రూ.25వేల కోట్లతో ప్రతిపాదనలు



  • Feb 15, 2024 11:20 IST
     అందువల్లే కోట్లాది రూపాయల నష్టం 

    కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ ఇంజినీరింగ్ మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్న కాగ్ రిపోర్ట్ 



  • Feb 15, 2024 11:18 IST
    రీఇంజనీరింగ్ వల్ల సమస్యలు 

    అప్పటికే పూర్తి చేసిన పనులలో మార్పులు.. రీ ఇంజనీరింగ్ వాల్ల కొన్ని పనులు పనికిరానివిగా మారాయి 



  • Feb 15, 2024 11:17 IST
    విద్యుత్ వినియోగానికి అదనపు వ్యయం 

    కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ వినియోగానికి అదనపు వ్యయం భారీగా పెరిగింది. 



  • Feb 15, 2024 11:15 IST
    భారీగా పెరిగిన వ్యయం.. ప్రయోజనం శూన్యం 

    కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయం భారీగా పెరిగింది. కానీ, అదనంగా ఏమీ ప్రయోజనం లేదన్న కాగ్ నివేదిక



  • Feb 15, 2024 11:13 IST
    కాగ్ నివేదికలో సంచలన విషయాలు

    కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు ఉన్నాయి



  • Feb 15, 2024 11:12 IST
    అసెంబ్లీలో కాగ్ నివేదిక

    కాగ్ నివేదికను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.



Advertisment
Advertisment
తాజా కథనాలు