కాకినాడలో యువడాక్టర్ బలవన్మరణం.. వాళ్ల బెదిరింపులే కారణమా! కాకినాడలో శ్రీకిరణ్ అనే యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. తన వద్ద నుంచి భూమి పత్రాలు తీసుకున్న స్థానిక రాజకీయ నాయకుడి సోదరుడు డబ్బులు చెల్లించకుండా వేధించడమే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. By Naren Kumar 26 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Kakinada: కాకినాడలో ఓ యువ వైద్యుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనతో స్థానికంగా విషాధం నెలకొంది. అశోక్ నగర్ కు చెందిన వైద్యుడు శ్రీకిరణ్ పురుగులమందు తాగి స్లీపింగ్ పిల్స్ మింగి ప్రాణం తీసుకున్నాడు. కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్ కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. శ్రీకిరణ్ రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కాకినాడ జీజహెచ్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆస్తి విషయంలో పలువురితో తగాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: చెలరేగిన భారత బ్యాట్స్మెన్.. ఆసిస్ ఎదుట భారీ లక్ష్యం అయితే మాజీ మంత్రి కన్నబాబు తమ్ముడు కల్యాణ్, అతడి అనుచరుల బెదిరింపులే తమ కుమారుడి మృతికి కారణమని కిరణ్ తల్లి ఆరోపించారు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో అతడికి కిరణ్ ఆరెకరాల భూమిని అమ్మగా, రావాల్సిన డబ్బులు రూ.25 లక్షలు ఇవ్వకుండా కల్యాణ్, అతడి అనుచరులు బెదిరింపులకు పాల్పడడంతో మనస్తాపంతో కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. #kakinada-news #ap-crime-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి