AP Crime: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి..

ఏపీలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని అందరూ కలిసి యానాంకు వచ్చారు. సరదాగా గడిపిన తర్వాత గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

New Update
AP Crime: పండుగ పూట పెను విషాదం.. గోదావరిలో స్నానానికి దిగి..

గత కొద్ది రోజులుగా గోదావరి నదిలో స్నానానికి వెళ్లి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెలవుల సందర్భంగా సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏపీలో నలుగురు యవకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న కాకినాడ జిల్లా (Kakinada District) తాళ్లరేవు మండలం గోపులంక వద్ద నిన్న నలుగురు యవకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో భారీగా చేరికలు..ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసి కాషాయ కండువాలు

పెండ్యాల బాలాజీ, ముద్దన ఫణీంద్ర గణేష్‌ మృతదేహాలు లభ్యం కాగా.. బాలాజీ, రవితేజ మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. నిన్న తాళ్లరేవు మండలం గోపలంక వద్ద గోదావరిలో స్నానానికి (Godavari ) తణుకుకు చెందిన ఏడుగురు యువకులు దిగారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతు కాగా.. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారిని తిరుమల రవితేజ(20), పెండ్యాల బాలాజీ(21), అనుమకొండ కార్తీక్(21), ముద్దన పనేంద్రి గణేష్(22)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోదావరిలో గాలింపు చేపట్టారు. రాత్రి వరకు మృతదేహాల కోసం పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు గాలింపు చేశారు. రాత్రి కావడంతో సహాయక చర్యలు నిలిపివేశారు.

అనంతరం ఈ రోజు తెల్లవారుజాము నుంచే అధికారులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు(Family members) తణుకు నుంచి గోపలంక గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. సరదాగా విహారయాత్రకు వచ్చిన స్నేహితులు మృత్యువాత పడడంతో తోటి స్నేహితులు (friends) కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు… పోటెత్తిన భక్తజనం

Advertisment
Advertisment
తాజా కథనాలు