Viral: స్వయం సంతృప్తి కోసం, చాలామంది చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. లైంగికంగా తమను తాము సంతృప్తి పరుచుకునేందుకు వివిధ రకాల వస్తువులను తమ శరీరంలోకి జొప్పించుకోవడం లాంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి తరహ ఘటన ఒకటి ఇటీవల అనగా ఫిబ్రవరి నెలలో తైవాన్‌లో జరిగింది. ఇక్కడ ఓ వ్యక్తి తన ప్రైవేటు పార్టులో వైబ్రేటర్‌తో ఆస్పత్రిలో చేరాడు.
Also read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ ప్రారంభించిన మోదీ.. భారత్‌లో ఇలాంటి వంతెన ఇదే ఫస్ట్ టైం
తైవాన్‌లోని కావోసియుంగ్‌కు చెందిన 24 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అతడి పురీషనాళంలో 20 సెంమీ లోతులో వైబ్రేటర్ చిక్కుకున్నట్టు గుర్తించారు డాక్టర్లు. ఫిబ్రవరి 13న, సదరు బాధితుడిని స్థానిక E-Da హాస్పిటల్‌లోని డాక్టర్ చెన్ చిహ్‌యి చికిత్స అందించారు. అంతకు ముందు రాత్రి అతడి తన భాగస్వామితో లైంగిక చర్యలో పాల్గొన్నట్టు స్థానిక మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ చెప్పారు. ఏదిఏమైనా.. ఆ చర్య తర్వాత అతడికి అసాధారణమైన అనుభూతి కలిగింది. అతడికి ప్రైవేటు పార్టులో ఏదో చిక్కుకున్నట్టు అనిపించింది. దాంతో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు.
Also read : Watch Video: అమ్మో బాబోయ్.. చీతాలకు నీళ్లు తాగించిన యువకుడు.. చివరికీ ఊహించని షాక్
తన ప్రైవేటు పార్టులో ఇరుక్కున్న వస్తువును తొలగించేందుకు రాత్రంతా తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ చివరికి విఫలయ్యాడు. అది మలద్వారం నుంచి పెద్దప్రేగు వరకు లోతుగా ఇరుక్కుపోయిందని ఎక్స్‌రేలో గుర్తించారు డాక్టర్లు. దీంతో అతడికి హుటాహుటిన ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నా.. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో.. రెండు రోజుల తర్వాత అతనికి ఆపరేషన్ చేశారు. కాగా, సుమారు రెండు గంటల పాటు జరిగిన శస్త్రచికిత్స అనంతరం వైద్యులు అతడి శరీరంలో నుంచి వైబ్రేటర్‌ను బయటకు తీశారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వైద్యులు ఫోర్సెప్స్‌ను ఉపయోగించి వైబ్రేటర్‌ను తొలగించారు. బయటకు తీసినప్పుడు కూడా ఆ వైబ్రేటర్ ఆన్‌లో ఉండటం గమనార్హం.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు