MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వలేమని చెప్పిన జైలు అధికారి

ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. తనకు ఇంటి భోజనం ఇవ్వడం ఆమె తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు జైలు నిబంధనల ప్రకారం ఆమెకు ఇంటి భోజనం ఇవ్వలేమని జైలు అధికారి కోర్టుకు తెలిపారు.

New Update
MLC Kavitha: కవిత బెయిల్‌ పై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు

Kavitha Can't be Given Home Food: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఇంటి భోజనం అందించడం లేదని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. జైలు అధికారులు.. కోర్టు ఆదేశాలు పాటించకుండా తనకు ఇంటి భోజనం ఇవ్వడం లేని పేర్కొన్నారు. ప్రస్తుతం కవిత హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారని.. ఆమెకు సౌత్‌ ఇండియన్ ఫుడ్ ఇవ్వడం లేదని ప్రస్తుతం ఆమె పరిస్థితి బాలేదని.. కవిత తరఫు న్యాయవాది నితేష్ రానా కోర్టుకు వివరించారు. మరోవైపు జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం ఇచ్చే అనుమతి లేదని తిహార్ జైలు అధికారి కోర్టుకు తెలిపారు.

Also Read: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో ఎవరూ ఉండరు: ఉత్తమ్

జైలు నిబంధనలు ప్రకారమే.. ఆహారం అందించానేది తమ ఆదేశమని, ఇంటి భోజనానికి అనుమతి లేదని తీహార్ జైలు అధికారులు చెప్పినట్లు కోర్టు తెలిపింది. కవిత నుంచి ఎలాంటి సమాచారం లేకుండా.. ఈ అప్లికేషన్‌ ఎలా దాఖలు చేస్తారంటూ ఆమె తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరింది. ఆమె నుంచి సరైన సూచనలు తీసుకొని.. మళ్లీ అప్లికేషన్ పెట్టాలని తెలిపింది.

ఈ విషయాన్ని తాము పరిగణలోకి తీసుకోము అని చెప్పడం లేదని.. కానీ అసలు వాస్తవం ఏంటో తెలియాని తేల్చి చెప్పింది.మరోవైపు జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం అనుమతి లేకపోతే.. కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని.. కవిత తరఫు న్యాయవాది వాదించారు. ఇదిలాఉండగా.. మద్యం విధానం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో.. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసం ప్రాంతంలో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టాక.. ఏప్రిల్ 9 వరకు జ్యూడిషల్ కస్టడీకి విధించింది కోర్టు.

Also Read: నాకు ఆ పుస్తకాలు కావాలి

Advertisment
Advertisment
తాజా కథనాలు