Jr.NTR: చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ మౌనానికి కారణమిదేనా?

చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి నేటి వరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై టీడీపీ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఎలా స్పందించినా టీడీపీకి చెందిన కొందరు నేతలు గతంలో ట్రోల్ చేశారని.. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సైలెంట్ గా ఉంటున్నారని జూనియర్ అభిమానులు వాదిస్తున్నారు.

New Update
Jr.NTR: చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ మౌనానికి కారణమిదేనా?

చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) నాటి నుంచి అటు టీడీపీ అభిమానులతో పాటు, ఎన్టీఆర్, నారా కుటుంబాలను అభిమానించే వారిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటే. అదే.. జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదు..? అని. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీకి చెందిన ఓ వర్గం విమర్శలు కూడా చేస్తోంది. కావాలనే ఆయన స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వాదన మాత్రం మరోలా ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 'ఎన్టీఆర్‌ (NTR), వైఎస్‌ఆర్‌ (YSR) ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు.' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. ఈ అంశంపై ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించలేదని పలువురు టీడీపీ అభిమానులు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానీతో గతంలో ఉన్న సన్నిహిత సంబంధాలే ఇందుకు కారణమని కూడా ఆ సమయంలో తీవ్ర విమర్శలు చేశారు.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneswari, Brahmani: నెక్స్ట్ టార్గెట్ భువనేశ్వరి, బ్రహ్మణి.. అరెస్ట్ ఖాయమా?

నారా భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు చేసిన వాఖ్యలపై కూడా జూనియర్ ఎన్టీఆర్.. 'వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసిందంటూ..' ఓ వీడియో విడుదల చేశారు. ఆ సమయంలోనూ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని టీడీపీ నేతలు విమర్శించారు. భువనేశ్వరి మేనళ్లుడిగా ఎన్టీఆర్ విఫలయ్యాడంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆ సమయంలో తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్టీఆర్ ఎలా స్పందించినా టీడీపీ నేతలు తప్పు పడుతున్నారని.. ఆ నేపథ్యంలోనే ఆయన ఈ సారి సైలెంట్ గా ఉన్నారని ఆయన అభిమానులు, సన్నిహితులు చెబుతున్నారు.

గతంలో 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున రాష్ట్రం అంతా ఆయన ప్రచారం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తర్వాత ఆయనను పట్టించుకోలేదని.. అయినా ఎన్టీఆర్ మాత్రం ఏ నాడు చంద్రబాబు కుటుంబాన్ని, టీడీపీని విమర్శించలేదని చెబుతున్నారు. తాను ఎప్పటికీ టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ అనేక సార్లు చెప్పిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఇంకా తారకరత్న దశదిన కర్మ నాడు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకోలేదంటూ అప్పట్లో ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో జూనియర్ ను కావాలే పక్కన పెడుతున్నారని.. అనవసరంగా ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఆయన సన్నిహితులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నేతలు మాత్రం జూనియార్ ఎన్టీఆర్ కావాలనే తమకు దూరం అవుతున్నాడని ఆరోపిస్తున్నారు. తనకు సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీ, చంద్రబాబు కుటుంబంపై ఎన్ని సార్లు తీవ్ర ఆరోపణలు చేసినా ఆయన పట్టించుకోకపోవడాన్ని పరిశీలిస్తే ఆయన వైఖరి ఏంటనేది అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎన్నటీఆర్ చెబితే వారు వింటారని.. కానీ ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండడంతోనే వారి మరింత రెచ్చిపోయారని ఆరోపిస్తున్నారు. రేపు ఖమ్మంలో జరిగే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సైతం ఆహ్వానించినా ఎన్టీఆర్ ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు