Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. లవర్ బాయ్ గా ఎన్టీఆర్, జాన్వీతో అదిరిపోయే డ్యూయెట్..!

'దేవర'మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రెండో సింగిల్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు తార‌క్, జాన్వీల‌ రొమాంటిక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతుంది.

New Update
Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. లవర్ బాయ్ గా ఎన్టీఆర్, జాన్వీతో అదిరిపోయే డ్యూయెట్..!

Devara Second Single : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'దేవర'. కొరటాల శివ (Koratala Siva) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ సింగిల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ కంపోజిషన్ లో రానున్న ఈ సాంగ్స్ కోసం తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి తరుణంలో మేకర్స్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, 'దేవర' రెండో సింగిల్ ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఓఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకోగా.. సెకండ్ సింగిల్ రొమాంటిక్ మెలోడీగా ఉండబోతుంది. దీనికి సంకేతంగా తార‌క్, జాన్వీల‌ రొమాంటిక్ పోస్ట‌ర్ ఒక‌టి వ‌దిలారు.

Also Read : ‘ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు’.. బిగ్ బాస్ సీజన్-8 టీజర్ చూశారా?

ఇందులో తారక్ స్టైలిష్ అండ్ రెఫ్రెషింగ్ లుక్ లో లవర్ బాయ్ గా కనిపించాడు. కాగా.. తంగం అంత‌రంగం అంటూ ఈ పాట సాగనున్నట్టు స‌మాచారం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ పతాకాలపై సుధాకర్‌, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'దేవర' పార్ట్-1 సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!

బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.

New Update
rj kajal in  Pahalgam attack

rj kajal in Pahalgam attack

Rj Kajal: కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలచివేస్తోంది. మినీ స్విజ్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. 

పహల్గామ్ లో కాజల్ 

అయితే బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది. నాకు కోసం ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది.  ''పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది.  ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు, అధికారులు ఎంతో కృషిచేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా, సేఫ్ గా ఉంది'' అంటూ వీడియోను షేర్ చేసింది. 

 latest-news | telugu-news | cinema-news

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

Advertisment
Advertisment
Advertisment