JR NTR: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

తాను క్షేమంగా భారత్ కు తిరిగి వచ్చానని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే తారక్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జపాన్ ను భారీ భూకంపం వణికించగా.. ఆయన ఇండియాకు రిటర్న్ అయ్యారు.

New Update
JR NTR: కొద్దిలో మిస్ అయ్యా.. జపాన్ భూకంపం పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

JR NTR: జపాన్(Japan) లో కొత్త ఏడాది జనవరి 1 న పెను భూకంపాలు(Earth Quakes) సంభవించాయి. ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికిస్తున్నాయి. భూకంపాల ప్రభావంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అయితే ఇటీవలే టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల క్రితం న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం జపాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ భూకంపం వార్తలు రాగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Also Read: Thaman: తమన్ ను ఏకి పారేస్తున్న నెటిజన్లు.. పవర్ స్టార్ సాంగ్ ను కాపీ కొట్టాడా?

ఇక ఈ విషయం పై తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను క్షేమంగా భారత్ కు తిరిగి వచ్చానని తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు. జపాన్ భూకంపం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. గత వారం రోజులుగా భూకంపం వచ్చిన ప్రాంతంలోనే ఉన్నాను. ఈ పెను విపత్తు సమయంలోను అక్కడి ప్రజలు ఎంతో దృడంగా ఉన్నారు. ఈ విపత్తు నుంచి అక్కడి ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

జపాన్‌లో ఈ పెను భూకంపం ధాటికి ఇప్పటివరకు 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. కుప్పకూలిన భవన శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టమయ్యాయి. పలుప్రాంతాల్లో బ్లాక్ అవుట్స్ ఏర్పడ్డాయి. 50 వేలకు పైగా నివాసాలకు విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.

Also Read: Guntur Kaaram : గుంటూరు కారం వివాదాల ఘాటు.. మరి.. బాక్స్ ఆఫీస్ లో తన ఘాటు చూపిస్తుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు