Jr NTR silence: తారక్‌ ప్లాన్‌ ఏంటి? మౌనం వ్యూహమా? చంద్రబాబుకు, జూనియర్‌ మధ్య విభేదాలు ఎందుకు?

చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటివరకు నోరు మెదపలేదు. చంద్రబాబు విషయంలో జూనియర్‌ సైలెంట్‌పై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మావయ్య విషయంలో ఏం మాట్లాడాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం. కష్టకాలంలో ఎందుకు స్పందించడం లేదంటున్న టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ట్విట్టర్‌లోనూ తారక్‌ స్పందించలేదు. కొడాలి నానితో స్నేహం వల్లే చంద్రబాబును దూరం పెట్టారంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి.

New Update
Jr NTR silence: తారక్‌ ప్లాన్‌ ఏంటి?  మౌనం వ్యూహమా?  చంద్రబాబుకు, జూనియర్‌ మధ్య విభేదాలు ఎందుకు?

AP SKILL DEVELOPMENT SCAM Jr NTR silence over chandrababu arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(skill development scam)లో అరెస్టైన చంద్రబాబుకు వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి సంఘీభావం వ్యక్తమవుతోంది. నారా, నందమూరి కుటుంబ సభ్యులందరూ మద్దతుగా నిలుస్తున్నారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్, ఆయన తమ్ముడు కళ్యాణ్ రామ్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. అరెస్ట్ పై వారు ఇంతవరకు స్పందించడంగాని, ట్వీట్ గాని చేయలేదు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా.. అన్నదమ్ములు ఇద్దరు స్పందించకపోవడంపై సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్​.. దేవర షూటింగ్ లో బీజీగా ఉన్నారు. ఆయన తమ్ముడు కూడా షూటింగ్ లోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆయన్ను ట్యాగ్ చేస్తూ ఒక్కసారి బయటకి వచ్చి మాట్లాడు అంటున్నారు. ఇలాంటి సమయంలో మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుగుతున్న వారితో పాటు అసలు రాజకీయాలు మనకి వద్దు, సినిమాలు చేసుకో చాలు అని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

విసిగిపోయారా?
గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. అప్పుడందరూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ, ఆ తర్వాతే అనే పరిణామాలు జరిగాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల పట్ల విసిగిపోయారని చెబుతున్నారు. అందుకే, సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదంటారు. అలాగే, ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణకు దూరంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. దీనంతటికి 2009 ఎన్నికల సమయంలోనే బీజం పడిందంటారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా జూనియర్ కు వస్తున్న స్పందనను చూసి చంద్రబాబు ఓ నిర్ణయానికొచ్చారంటారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ఉంటే... తన కుమారుడు నారా లోకేశ్ రాజకీయ ఎదుగుదలకు అవరోధంగా భావించారంటారు. అప్పటి నుంచి చంద్రబాబు... జూనియర్ ఎన్టీఆర్ అంటే అంటీముట్టనట్లు... దూరం దూరంగా ఉంచుతున్నారని చెబుతారు.

2009 నుంచే దూరంగా జూనియర్‌:
2009 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి క్రమంగా దూరం జరిగారంటారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ను నారా లోకేష్ కోసం చంద్రబాబు దూరంగా పెట్టారా.. లేక నారా కుటుంబాన్ని జూనియర్ యే దూరం పెట్టారా అన్నది ఎవరికీ తెలియదు. ఆనాటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే పొకస్ పెడుతున్నారు. గతంలో రాజకీయాలకు తన వయసు సరిపోదని, సినీ కేరీర్ తనకు ముఖ్యమని చెప్పేవారు. ఇక, ఆయన తమ్ముడు కళ్యాణ్ రామ్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. అన్నంటే అభిమానం, టీడీపీలో ఆయనకు దక్కిన గౌరవం ప్రత్యక్షంగా చూసిన కళ్యాణ్ రామ్... టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీలో ఉన్నారు. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తే.. అది వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టెట్ మెంట్ ఇచ్చినట్లు అవుతుందని సైలెంట్ గా ఉన్నారని మరికొందరు అంటారు.

ALSO READ: 13 సార్లు ఏపీ బడ్జెట్ డాక్స్‌పై చంద్రబాబు సంతకం చేశారు.. ఏపీ సీఐడీ సంచలన ప్రెస్‌మీట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు