ఉగ్రవాదులతో 20 గంటలు కాలక్షేపం..ఆ తర్వాత..!!

రేచల్‌పై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. తమను బంధించిన ఉగ్రవాదులను ఏకంగా 20 గంటలు కాఫీ, కుకీలు ఇచ్చి వారితో మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం చేసింది. వెంటనే పోలీసులు రావడంతో చంపేస్తామని ఉగ్రవాదుల వారిని బెదిరించారు. అయితే, ఏ మాత్రం బెనకకుండా చేతి వేళ్లతో ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని సైగలు చేయడంతో స్వాట్ బృందం ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

New Update
ఉగ్రవాదులతో 20 గంటలు కాలక్షేపం..ఆ తర్వాత..!!

Rechel: 65 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ రేచల్ ఎడ్రిపై ఇజ్రాయెలీయుల తోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హమాస్ ఉగ్రవాదుల చేతిలో తన ఇంట్లోనే 20 గంటలపాటు బందీగా గడిపిన ఆమె కాఫీ, కుకీలు ఇచ్చి వారితో మాటలు కలుపుతూ పోలీసులు వచ్చే వరకు కాలక్షేపం చేసింది.  చివరికి చిన్న ఉపాయంతో వారి నుంచి బయటపడడమే కాదు.. వారిని ఏకంగా పైకి పంపడంలో పోలీసులకు సాయం చేసింది.

ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి పడేసిన సంగతి తెలిసిందే. ఇళ్లలోకి వెళ్లి మరీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఎంతోమందిని బందీలుగా చేసుకున్నారు. అలాగే,  రేచల్ ఎడ్రి అనే మహిళ  ఇంట్లోకి ప్రవేశించారు. రేచల్, ఆమె భర్తను బందీలుగా చేసుకున్నారు. వారి పిల్లలు ఇద్దరూ పోలీసులే. దీంతో రేచల్ దంపతులు బెదిరిపోయి హడలిపోలేదు. వారు వచ్చి ఎలాగైనా కాపాడతారని, కాకపోతే అప్పటి వరకు బతికి ఉండాలంటే ఉగ్రవాదులను ఏమార్చాలని నిర్ణయించుకున్నారు.

Also read: ఆర్థిక పేదరికంలో మగ్గుతున్న సామాన్య జనం..!

publive-image

ఉగ్రవాదులు ఆకలిగా ఉన్నట్టు గమనించి డ్రింక్ ఆఫర్ చేశారు రేచల్ దంపతులు. అలాగే, కాఫీ.. కుకీలు కూడా ఇచ్చి వారితో నెమ్మదిగా మాటలు కలిపారు. తాను ఇన్సులిన్ వేసుకోవాలని చెప్పి ఉగ్రవాదుల దృష్టి ఆమె పిల్లల వైపు వెళ్లకుండా జాగ్రత్త తీసుకున్నారు. అంతేకాదు, బిక్కుబిక్కుమంటూనే తనకు అరబిక్ నేర్పిస్తే తాను హిబ్రూ నేర్పిస్తానని ఉగ్రవాదులకు ఆఫర్ కూడా చేశారు. ఇలా ఏకంగా 20 గంటలు ముచ్చట్లతో వారిని డైవర్ట్ చేసింది. వెంటనే పోలీసులు రావడంతో చంపేస్తామని ఉగ్రవాదుల వారిని బెదిరించారు. అయితే, ఏ మాత్రం బెనకకుండా చేతి వేళ్లతో ఇంట్లో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నారని సైగలు చేసింది. దీంతో అలర్ట్ అయిన స్వాట్ బృందం ఆ ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి రేచల్, ఆమె భర్త డేవిడ్‌ను రక్షించారు. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు రేచల్ ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రేచల్ ఘటన తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేచల్ ను ఆలింగనం చేసుకుని ప్రశంసించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు