Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్
తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.
తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.
గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. టీ-సాట్ ద్వారా ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆన్ లైన్ ద్వారా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నామని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
రైల్వేశాఖ నుంచి 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 29వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి 18 -36 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది.
రేవంత్ సర్కార్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్‌పై అభ్యర్థుల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతి తక్కువ వ్యవధిలోనే ఒకే రకమైన అర్హతలతో కూడిన ఉద్యోగ ప్రకటన, పరీక్షల షెడ్యూల్ తమకు నష్టం వాటిల్లేలా ఉందంటూ ఆందోళన చెందుతున్నారు. రీ షెడ్యూల్ చేయాలని కోరుతున్నారు.
త్వరలో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ మ్యాప్ మారిపోబోతోంది. జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీల విలీనానికి చురుగ్గా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి జీహెచ్ఎంసీ విస్తరించనుంది.
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్లో 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ తేది వెల్లడించింది. అయితే లాస్ట్ నోటిఫికేషన్ 2022లో వెలువడగా.. 2025 వరకూ వేచి చూడటంపై అభ్యర్థులు నిరాశకు గురువుతున్నారు.
టీచర్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 6వేల పోస్టులతో 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. దీనికంటే ముందు 2025 ఏప్రిల్ లోనే టెట్ నిర్వహించనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొంది. ఇది నిరుద్యోగులు మరో సదవకాశంగా భావించొచ్చు.
TG: జాబ్ క్యాలెండర్‌పై రాహుల్ గాంధీకి ట్వీట్ చేశారు కేటీఆర్. 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పకుండా జాబ్ లెస్ క్యాలెండర్‌ను విడుదల చేసిందన్నారు. దీనిపై అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగాలకు రాహుల్ వివరణ ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు 'అమ్మ సెల్ఫ్ హెల్ప్' గ్రూపులను ప్రవేశపెడతామని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు.