/rtv/media/media_files/2024/12/31/dasZcgZJ8Mxzy9CRSRAt.jpg)
uPSC NDA Photograph: (uPSC NDA)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్డీఏ 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. డిసెంబర్ 11న ఈ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 12వ తరగతి చదువుతున్న లేదా పూర్తి అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.మొత్తం 406 పోస్టులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 13న పరీక్ష నిర్వహించనున్నారు.
ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి
🚨 NDA 1 Application Form 2025 🚨
— EduTaxTuber (@EduTax_Tuber) December 31, 2024
⏳ Last Date: Dec 31, 2024 (6 PM)
📋 Eligibility: Class 12 passed/appearing
💰 Fee: ₹100 (Gen/OBC); Exempt for SC/ST/Women
🖊 Correction Window: Jan 1-7, 2025
👉 Apply Now: https://t.co/HjHt3PFgzH#NDA2025 #UPSC #NDALastDate pic.twitter.com/9X4DUj5Spl
ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు
తప్పులు చేస్తే దిద్దుబాటు..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఈ పరీక్ష రుసుమును చెల్లించవచ్చు. దరఖాస్తు రుసుము జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్‌సీ, ఎస్టీ, మహిళలకు ఎలాంటి రుసుము లేదు. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారు ఏవైనా తప్పులు చేస్తే దిద్దుబాటు కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను జనవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు.
ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి!
ఈ ఎన్డీఏ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామా, విద్యార్హతలను నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత వివరాల భాగంలో అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, ఆధార్ నంబర్, జాతీయత, రుసుము ఉపశమనానికి అనుమతి, సంఘం, వైవాహిక స్థితి మొదలైన వాటిని ఫిల్ చేయాలి. upsc.gov.in అనే వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం
అభ్యర్థులు అన్ని వివరాల తమ పూర్తి చిరునామా, ఇ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ కావాలి. ఆ నంబర్‌ను గుర్తు పెట్టుకోవాలి. ఈ పరీక్షకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. రాత పరీక్షలో దాదాపు 8000 నుండి 10,000 మంది అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.