/rtv/media/media_files/2026/06/05/singareni-jobs-2026-06-05-17-36-13.jpg)
తెలంగాణలోని నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గుడ్ న్యూస్ తెలిపింది. సంస్థలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న నాన్-ఎగ్జిక్యూటివ్ కేటగిరీ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సింగరేణి అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా సంస్థలోని వేర్వేరు విభాగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో మైనింగ్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష, అర్హతల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అయితే వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలను నిర్ణయించారు. కొన్ని పోస్టులకు ఐటీఐ, డిప్లొమా అర్హతగా ఉండగా.. మరికొన్ని పోస్టులకు డిగ్రీ లేదా సంబంధిత రంగంలో నైపుణ్యాలు ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
అప్లై చేసుకునే అభ్యర్థులు మొదట సింగరేణి అధికారిక వెబ్‌సైట్www.scclmines.com లోకి వెళ్లి 'Career' లేదా 'Recruitment' లింక్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. దరఖాస్తు కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రింట్‌తో పాటు సంబంధించిన విద్యార్హతలు, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను యాడ్ చేసి సైన్ చేయాలి. వీటిని మైన్స్ లేదా డిపార్ట్‌మెంట్ హెడ్స్ ద్వారా కొత్తగూడెంలోని జనరల్ మేనేజర్ EE & RC కార్యాలయానికి పంపించాలి. జూన్ 23వ తేదీ లోపు ఈ దరఖాస్తులు వెళ్లాలి. ఆ తర్వాత ఈ దరఖాస్తును స్వీకరించరు.
ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!
పోస్టులివే..
ఫార్మాసిస్ట్ (T&S గ్రేడ్-D): 19 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ - ల్యాబ్ (Tఅండ్S గ్రేడ్-D): 15 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ - ఎక్స్-రే (T&S గ్రేడ్-D): 06 పోస్టులు
ఈసీజీ/2డీ ఎకో/టీఎంటీ/హోల్టర్ టెక్నీషియన్ (Tఅండ్ S గ్రేడ్-D): 03 పోస్టులు
ఫిజియోథెరపిస్ట్ (T&S గ్రేడ్-B): 02 పోస్టులు
డైటీషియన్ (T అండ్ S గ్రేడ్-B): 02 పోస్టులు
హెల్త్ ఎడ్యుకేటర్ (Tఅండ్ S గ్రేడ్-D): 02 పోస్టులు
రిఫ్రాక్షనిస్ట్ (T అండ్ S గ్రేడ్-D): 01 పోస్టు
ఇది కూడా చూడండి: Annamalai's resignation : అన్నామలై రాజీనామా ఆమోదం..కొత్తపార్టీ దిశగా అడుగులు
Follow Us