రూ.20000 స్టైఫండ్.. RBI సువర్ణావకాశం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఇక అప్లై చేసుకోవాలంటే పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ కోర్స్‌ చేసి ఉండాలి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఇక అప్లై చేసుకోవాలంటే పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ కోర్స్‌ చేసి ఉండాలి. మేనేజ్మెంట్‌, స్టాటిస్టిక్స్‌, లా, కామర్స్‌, ఎకనామిక్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ చేసి ఉండాలి. న్యాయ శాస్త్రంలో పొఫెషనల్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఫుల్‌ టైం చేసి ఉండాలి.

Also Read : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 పోస్టులు.. అర్హులు ఎవరంటే?


రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం కేవలం 125 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఆర్‌బీఐ ఎంపిక చేస్తుంది. సమ్మర్‌లో ఈ ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరీ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది. ఇలా ఛాన్స్ వచ్చిన వాళ్లకు నెలకు రూ.20,000 స్టైఫండ్‌ పొందే సువర్ణావకాశం ఉంది.

Also Read : స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Tenth Results: నేడు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు. https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు.

New Update
AP CM Chandrababu

AP CM Chandrababu

ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse. ap. gov. in, https://apopenschool. ap. gov. in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Advertisment
Advertisment
Advertisment