/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-8-3.jpg)
CISF Jobs
పదవ తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ వంటి పోస్టులను సీఐఎస్‌ఫ్ భర్తీ చేపట్టనుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు పదవ తరగతి పూర్తి చేసి ఉంటే చాలు. అయితే 2025 ఆగస్టు 1 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య మాత్రమే అభ్యర్థుల వయస్సు ఉండాలి.
ఇది కూడా చూడండి: Sridhar Babu: MLC ఎన్నికలకు దూరం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన!
बैंक ऑफ बड़ौदा में 4000 भर्तियां, CISF में 1161 वैकेंसी, इस हफ्ते निकलीं 10 हजार से ज्यादा नौकरियां #Education #Jobs #vacancy #recruitment | Anchor @Rraj92
— Dainik Bhaskar (@DainikBhaskar) February 23, 2025
पूरा वीडियो देखने के लिए लिंक पर क्लिक करें-https://t.co/RvsvYpPwon pic.twitter.com/kwV2eUh1XI
ఇది కూడా చూడండి: Pope: పోప్ ఆరోగ్య పరిస్థితి విషమం.. ఏమీ చెప్పలేమంటూ అధికారుల ప్రకటన!
ఈ టెస్టుల ఆధారంగా..
కేటగిరీని బట్టి వయస్సు కూడా సడలింపు ఉంటుంది. శారీరక సామర్థ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీబీటీ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం లభిస్తుంది. జనరల్/OBC/EWS కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తూ ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. మార్చి 5 నుంచి ఏప్రిల్ 3 వరకు వీటికి అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!
ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్ కొబ్బరి నూనె.. ఏది మంచిది?