/rtv/media/media_files/2025/01/12/bYic2bBISOPJP2jKZRlL.jpg)
AAI Jobs Photograph: (AAI Jobs)
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(AAI) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రోగ్రామ్ హెడ్, బయో మెకానిక్స్, యంగ్ ప్రొఫెషనల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా కేవలం 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్ sportsauthorityofindia.nic.inలో అప్లై చేసుకోవచ్చు. లేదా recruitment.archery@gmail.comకు అప్లికేషన్ ఫారమ్ నింపి మెయిల్ చేయాలి. ఈ పోస్టులకు జనవరి 31 సాయంత్రం 5గంటల్లోగా అప్లై చేసుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత అప్లై చేసుకోవాలనుకున్నా కూడా కుదరదు.
ఇది కూడా చూడండి: Champions Trophy 2025 : టీమిండియాకు బిగ్ షాక్ .. బుమ్రా ఔట్!
ప్రోగ్రామ్ హెడ్ - 1 పోస్ట్
బయో మెకానిక్స్ - 1 పోస్ట్
యంగ్ ప్రొఫెషనల్ (జనరల్) - 1 పోస్ట్
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ - 1 పోస్ట్
ఇది కూడా చూడండి: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?
AAI ప్రోగ్రామ్ హెడ్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వయో పరిమితి గరిష్టంగా 65 సంవత్సరాలు ఉండాలి. యువ ప్రొఫెషనల్‌కి గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండగా, బయో మెకానిక్స్ పోస్టుకు గరిష్టంగా 40 సంవత్సరాలు, ఎంటీఎస్ పోస్టుకు గరిష్టంగా 35 సంవత్సరాలు అయి ఉండాలి.
ఇది కూడా చూడండి: Sankranthi Muggulu 2025: భోగి పండగకు ఈజీగా కుండల డిజైన్స్ .. 5 నిమిషాల్లోనే వేయిండిలా!
ఎంపిక తర్వాత నెలకు జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన తర్వాత ప్రోగ్రామ్ హెడ్‌గా నెలకు రూ.1,50,000, బయో మెకానిక్స్ నెలకు రూ. 75,000, యంగ్ ప్రొఫెషనల్ (జనరల్) నెలకు రూ.50,000, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నెలకు రూ.20,000 ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలి.
ఇది కూడా చూడండి:Sankranthi Rangavalli 2025: సంక్రాంతికి సింపుల్ గా సూపర్ ముగ్గు.. 5 నిమిషాల్లోనే వేయిండిలా!