ఏపీలో మరో కొత్త పార్టీ? జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైతే కొత్త పార్టీ పెడతానంటూ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపారు.

New Update
ఏపీలో మరో కొత్త పార్టీ? జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన లక్ష్మీనారాయణ ఇప్పుడు అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ.. కొత్త పార్టీ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ఏపీలో బోగస్ ఓట్ల ఏరివేత ఖచ్చితంగా జరగాలన్నారు. డూప్లికేట్ ఓట్లు తొలగించాల్సిందేనని, నిజమైన ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read : ప్రియుడి ఫోన్‌ చూసి ప్రియురాలు షాక్.. 13 వేల మహిళల న్యూడ్‌ ఫొటోలు లభ్యం

ఈ మేరకు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్దమవుతున్న ఆయన.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి పోటీ చేస్తానని చెబుతూనే.. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందనడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇక గతంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తానని చెప్పి.. ఇప్పుడు కొత్త పార్టీని తెరపైకి తీసుకురావడం ఆసక్తికర అంశంగా మారింది. దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న విశాఖ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్ ఫేర్‌కు 50కు పైగా కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అక్కడే ఆఫర్ లెటర్‌లు కూడా ఇస్తామని, ఇందులో వెనుకబడిన అభ్యర్థులకు స్కిల్ డవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఆపై విద్యార్హత ఉన్న వారు ఎవరైనా జాబ్ ఫేర్‌కు హాజరు కావచ్చని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. సీబీఐ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మీ నారాయణ.. 2019 ఎన్నికలకు ముందు జనసేనన పార్టీలో చేరారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బర్రెలక్క (శిరీష)కు మద్దతుగా ప్రచారంలోనూ పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు