Jawan Movie Review: జవాన్ మూవీ రివ్యూ.. మెస్మరైజ్ చేసిన షారూక్

పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత, షారూక్ ఖాన్ నుంచి వచ్చిన సినిమా జవాన్. పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో, జవాన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాల్ని జవాన్ అందుకున్నాడా?

New Update
Jawan Movie Review: జవాన్ మూవీ రివ్యూ.. మెస్మరైజ్ చేసిన షారూక్
Jawan Movie Review: విక్రమ్ రాథోడ్ (షారూఖ్ ఖాన్) మెట్రో రైలును హైజాక్ చేస్తాడు. 376 మంది ప్రయాణికుల ప్రాణాలను డేంజర్‌లో పడేస్తాడు. విక్రమ్ రాథోడ్‌తో చర్చలు జరపడానికి రంగంలోకి దిగుతుంది నర్మద (నయనతార). టాక్స్ కూడా సక్సెస్ ఫుల్‌గా సాగుతాయి. కానీ అతడ్ని పట్టుకోవడంలో నర్మద ఫెయిల్ అవుతుంది. అయితే విక్రమ్, ఇలా ట్రయిన్‌ను హైజాక్ చేయడం వెనక ఉద్దేశం వేరు. అతడి లక్ష్యం వేరు. చివరికి అతడు ఏం చేశాడు? విక్రమ్-నర్మద మధ్య కనెక్షన్ ఏంటి? ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి)తో విక్రమ్ ఎందుకు గొడవ పడతాడు? విక్రమ్ ట్రయిన్‌ను హైజాక్ చేయడానికి, కాళీకి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే జవాన్ సినిమా చూడాల్సిందే.


నటీనటుల పనితీరు
విక్రమ్ రాథోడ్‌గా షారూక్ ఖాన్ (Shah Rukh Khan) తన టాలెంట్ చూపించాడు. సినిమాలో షారుఖ్ వన్ మ్యాన్ షో కనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెస్మరైజ్ చేశాడు. షారూక్ స్క్రీన్ ప్రెజెన్స్, ద్విపాత్రాభియనం, వన్ లైనర్ డైలాగ్స్ అదిరిపోయాయి. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ పాత్రలో మరోసారి బాగా రాణించాడు. దీపికా పదుకోన్ (Deepika Padukone) చిన్న పాత్ర అయినప్పటికీ తన మార్క్ చూపించింది. నయనతార లుక్స్, యాక్టింగ్ బాగున్నాయి. ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 javan: Javan Movie Review.. Mesmerized Shah Rukh పాజిటివ్ ఎలిమెంట్స్
సినిమాకు మెయిన్ పాజిటివ్ ఎలిమెంట్ షారూక్ ఖాన్ నటన. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు కింగ్ ఖాన్. ఇక సినిమాకు మరో పాజిటివ్ ఎలిమెంట్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఎప్పట్లానే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ మెస్మరైజ్ చేశాడు. పాటలు ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నిలబెట్టాడు అనిరుధ్. ఇక జవాన్‌లో ఫైట్స్ అదిరిపోయాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడేలా ఉన్నాయి. ప్రతి యాక్షన్ ఎపిసోడ్‌కు ఓ డిఫరెంట్ థీమ్ ఇవ్వడం బాగుంది. దీంతో పాటు షారూక్ ఎలివేషన్ సన్నివేశాలు బాగున్నాయి. పక్కా కమర్షియల్ సినిమాకు కావాల్సిన మసాలాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. కథ అక్కడక్కడ రొటీన్ అనిపించినప్పటికీ, 2 గంటల 45 నిమిషాల పాటు షారూక్-అట్లీ కూర్చోబెట్టగలిగారంటే దానికి కారణం సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే.

Also Read: Jawan Movie: నువ్వెప్పుడూ సినిమాకి వెళ్తే..అప్పుడూ నేను కూడా వస్తా!

javan: Javan Movie Review.. Mesmerized Shah Rukh నెగెటివ్ ఎలిమెంట్స్
ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ సినిమా కథ రొటీన్. చాలా తెలుగు సినిమాల్లో చూసేసిన కథే ఇది. అందుకే షారూక్ ఏం చేసినా, దాని వెనక ఏం జరిగిందనేది ముందే ఊహించుకోవచ్చు. అది ప్రధానమైన లోపం. దీనికితోడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బలహీనంగా ఉంది. అట్లీ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉంటాయి. అతడు తీసిన రాజురాణి, తేరి, అదిరింది, లాంటి సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలిచాయి. కానీ తొలిసారి, ఈ దర్శకుడు తన కెరీర్‌లో కాస్త డల్‌గా ఉండే ఫ్లాష్ బ్యాక్ రాసుకున్నాడు. ఇది ఆశించిన స్థాయిలో ఎంటర్ టైన్ చేయదు. దీనికితోడు పాటలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. తెరపై చూడ్డానికి బాగున్నప్పటికీ, చెవులకు ఇంపుగా అనిపించవు.

javan, Javan Movie Review, Mesmerized Shah Rukh ఫైనల్ స్టేట్ మెంట్
ఓవరాల్‌గా జవాన్ సినిమాను ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఓసారి చూడొచ్చు. అక్కడక్కడ మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ ఛాయలు కనిపించినప్పటికీ.. షారూక్ వన్ మేన్ షో, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

➼నటీనటులు - షారూక్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, దీపిక పదుకోన్, సాన్యా మల్హోత్రా, తదితరులు..
➼ బ్యానర్ - రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్స్
➼ నిర్మాత - గౌరీఖాన్
➼ మాటలు-దర్శకత్వం - అట్లీ
➼ సంగీతం - అనిరుధ్
➼ డీవోపీ - జీకే విష్ణు
➼ ఎడిటింగ్ - రూబెన్
➼ రన్ టైమ్ - 2 గంటల 49 నిమిషాలు
➼ రేటింగ్ - 2.75/5

Also Read: ‘లవ్‌ యూ స్వీటి’.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విట్టర్ రివ్యూ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు