Japan successfully launches H-IIA Rocket: జాబిల్లి పైకి జపాన్‌!

జపాన్‌ దేశం కూడా చంద్రుని పైకి పంపిన హెచ్‌ -2 ఏ రాకెన్‌ లూనార్‌ ల్యాండర్‌ ను తీసుకుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

New Update
Japan successfully launches H-IIA Rocket: జాబిల్లి పైకి జపాన్‌!

Japan successfully launches H-IIA Rocket: భారత్‌ ఎప్పుడైతే చంద్రుని మీదకు చంద్రయాన్‌-3 ని పంపి ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుందో..అప్పటి నుంచి మిగిలిన అన్ని దేశాలు కూడా ఎలాగైనా సరే చంద్రుని మీదకు తమ దేశపు మిషన్లను కూడా పంపించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే జపాన్‌ దేశం కూడా చంద్రుని పైకి పంపిన హెచ్‌ -2 ఏ రాకెన్‌ లూనార్‌ ల్యాండర్‌ ను తీసుకుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

ఈ ప్రయోగాన్ని గతంలో కూడా చాలా సార్లు జపాన్ దేశం వాయిదా వేసింది. ఎట్టకేలకు జపాన్‌ లోని తనెగాషియా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

హెచ్‌ -2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన సుమారు 13 నిమిషాల తరువాత భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ (Japan Aerospace Exploration Agency )పేర్కొంది. విశ్వంలోని మరిన్ని రహస్యాలను తెలుసుకునేందుకు గానూ ఈ ప్రయోగాన్ని చేసినట్లు జపాన్‌ పేర్కొంది. అంతేకాకుండా గెలాక్సీల మధ్య వేగంతో పాటు మరిన్ని పరిమితులను కనుగొనేందుకు గానూ ఈ ఉపగ్రహన్ని ప్రయోగించామని వారు వివరించారు.

జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్మార్ట్ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌ (Smart Lander for Investigating Moon) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్‌ ను హెచ్‌2 రాకెట్‌ లో పంపారు. ఈ ల్యాండర్ వచ్చే ఏడాది జనవరి కానీ, ఫిబ్రవరిలో కానీ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని జపాన్‌ తెలిపింది. ఇదే కనుక విజయవంతమైతే చంద్రుని పై కాలు మోపిన ఐదో ప్రపంచ దేశంగా జపాన్‌ చేరుతుంది.

ఇప్పటి వరకు చంద్రుని పై భారత్‌, చైనా, అమెరికా, రష్యాలు మాత్రమే కాలు మోపాయి. జాబిల్లి పైకి స్లిమ్ ల్యాండర్న్ విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో జపాన్‌ కు అభినందనలు తెలిపింది. మే నెలలో జపాన్ చేపట్టిన మిషన్ పేలిపోయింది. దీంతో ఇప్పుడు ఈ ప్రయోగం విజయం సాధించడం జపాన్‌కు ఎంతో ముఖ్యం.

Also Read: భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్‌-1 సెల్ఫీలు.. వీడియో చూడాల్సిందే భయ్యా!

Advertisment
Advertisment
తాజా కథనాలు