'దేవర' లో ఛాన్స్ రావడం నా అదృష్టం.. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే : జాన్వీ కపూర్

'మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో దేవర మూవీలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

New Update
'దేవర' లో ఛాన్స్ రావడం నా అదృష్టం.. సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే : జాన్వీ కపూర్

Janhvi Kapoor Comments On Devara : బాలీవుడ్ (Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 'దేవర' (Devara) మూవీతో సౌత్ ఇండస్ట్రీ (South Industry) లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ సరసన ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ సినిమాలో 'తంగం' అనే పాత్రలో కనిపించనుంది.

కొద్ది నెలల క్రితమే దేవర నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. అందులో లంగాఓణిలో మరింత అందంగా కనిపించి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మాహీ' అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'దేవర'లో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Also Read : రన్ వీర్ సింగ్ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? డైరెక్టర్ టీమ్ ఏం చెప్పిందంటే..

'దేవర' లో నా పాత్ర ఎలా ఉంటుందంటే..

" దేవర మూవీలో తంగం అనే రోల్ చేస్తున్నాను. ఈ రోల్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్ అంతా చాలా సరదాగా జరిగింది. సెట్స్ లో ఉన్న వాళ్లంతా నాపై ఎంతో ప్రేమ చూపిస్తారు.
మూవీటీమ్ డెడికేషన్ చూసి షాక్ అయ్యాను. ఇది ఓ డిఫరెంట్ స్టోరీ.. చాల అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది.

దేవర లో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా.. ఇంత మంచి సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు" అని చెప్పింది. దీంతో దేవర పై జాన్వీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మరోసారి వింటేజ్ కాంబో.. బాలయ్య సినిమాలో విజయశాంతి

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ 2 లో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్. బ్లాక్ బస్టర్ 'అఖండ' సీక్వెల్ గా 'అఖండ 2' తెరకెక్కుతోంది.

New Update

Akhanda 2 Update:   రాజకీయాలతో కొంతకాలం సినిమాలకు దూరమైనా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇటీవలే  'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమాతో అలరించిన విజయశాంతి.. ఇంతలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

అఖండ 2 లో విజయశాంతి 

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ 2 లో విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 

ఇదిలా ఉంటే  'అఖండ 2:  తాండవం'  చిత్రీకరణ  ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే  సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ,  VFX పనులు ఆలస్యమవుతుండడంతో వచ్చే ఏడాది  2026  సంక్రాంతికి  వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ  అయితే  విషయంపై ఇంకా అధికారిక ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. 

telugu-news | cinema-news | latest-news | vijayashanthi

Advertisment
Advertisment
Advertisment