TDP-JSP : జనసేన VS టీడీపీ.. కడపలో స్టిక్కర్స్ వార్..!

కడప జిల్లా ప్రొద్దుటూరులో జనసేన, టీడీపీ మధ్య పొత్తుల వార్ నడుస్తోంది. తానే అభ్యర్థినంటూ కడప, ప్రొద్దుటూరులో టీడీపీ నేతల పోస్టర్స్ దర్శనిమిస్తున్నాయి. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి పోస్టర్స్‌ వేయడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు.

New Update
TDP-JSP : జనసేన VS టీడీపీ.. కడపలో స్టిక్కర్స్ వార్..!

TDP & JSP - YCP : ఏపీ(AP) లో అధికార పార్టీ వైసీపీ(YCP) ని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు, జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థులకు ధీటుగా ఆ పార్టీ అధినేతలు బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్లాన్స్ చేస్తోన్నారు. అయితే, పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు తామే  అభ్యర్థులమంటూ పలుచోట్ల  పోస్టర్స్, స్టిక్కర్స్ అంటిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష

కడప(Kadapa) లో తానే అభ్యర్థినంటూ టీడీపీ ఇంచార్జ్‌ మాధవి రెడ్డి(Madhavi Reddy) పోస్టర్స్, స్టిక్కర్స్ ఇంటింటా వెలిశాయి. దీంతో, ఇంచార్జ్‌ మాధవిరెడ్డి తీరుపై జనసైనికులు, టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి ఇలా ఎలా చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రొద్దుటూరులోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి అంటూ పోస్టర్స్ వెలశాయి. పొత్తు ధర్మాన్ని పాటించకుండా స్వయం ప్రకటనపై పలువురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Also Read: ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్‌ భేటీ!

ఇలా కడప జిల్లాలో జనసేన టీడీపీ నేతల మధ్య పొత్తుల వార్ నడుస్తోంది. పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి టీడీపీ నేతలు పోస్టర్స్‌ వేస్తోన్నారు. దీంతో, జనసైనికులు మండిపడుతున్నారు. పొత్తు ధర్మం టీడీపీ నేతలు పాటించడం లేదని ఫైర్ అవుతున్నారు. మరి ఈలాంటి గొడవలు మరెక్కడ జరగకుండా ఉండేందుకు త్వరలో పార్టీ అధినేతలు అభ్యర్థులను ప్రకటిస్తే బెటర్ అని ఫీలవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు