Janasena vs Mahasena: మహాసేన రాజేశ్ కారు ధ్వంసం.. ఆగ్రహంతో ఊగిపోతున్న జనసైనికులు! అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస జరిగింది. మహాసేన రాజేశ్ కు టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మహాసేన రాజేశ్ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు. By Trinath 28 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి TDP Janasena War: టీడీపీ-జనసేన సీట్ల పంపకం రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున వివాదానికి కారణమైంది. అసంతృప్తులు అంతా ఏకమవుతున్నారు. కష్టపడిన వారికి టికెట్లు ఇవ్వకుండా కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారని పలువురు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాలున్న ఏసీ అసెంబ్లీలో జనసేన-టీడీపీ ఇప్పటివరకు కలిసికట్టుగా 99స్థానాలు ప్రకటించాయి. అందులో జనసేనకు ఐదు సీట్లు కేటాయించారు. మొత్తంగా జనసేనకు 24సీట్లులో పోటి చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్ స్వయంగా చెప్పారు. దీనిపై చాలా చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, అంబాజీపేటలో జనసైనికులు చాలా రోజులుగా నిరసనలకు దిగుతున్నారు. కారు ధ్వంసం: టీడీపీ- జనసేన మధ్య టికెట్ల రచ్చ ఇంకా కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం అంబాజీపేటలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస జరిగింది. మహాసేన రాజేశ్‌పై జనసైనికుల ఉగ్రరూపం చూపించారు. మహాసేన రాజేష్‌కు టికెట్ కేటాయించడంపై జనసైనికులు ఆగ్రహంగా ఉన్నారు. మహాసేన రాజేశ్ కారును ధ్వంసం చేశారు కార్యకర్తలు. 'రాజేశ్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. జనసైనికుల రచ్చతో అక్కడి నుంచి రాజేశ్ వెళ్లిపోయారు మహాసేన రాజేష్. ఇక తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటనతో పలుచోట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. రోడెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పలుచోట్ల పార్టీకి రాజీనామాలు కూడా చేస్తున్నారు. ఇలా ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. అటు రాజమండ్రి రూరల్‌లో జనసేనకు షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకే అంటూ ప్రచారం జరుగుతోంది. Also Read: విహారిని అందుకే పీకేశాం.. ఏసీఏ సంచలన లేఖ! WATCH: #pawan-kalyan #tdp #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి