Pawan Kalyan: పవన్ 4వ విడత వారాహి షెడ్యూల్ ఫిక్స్..యాత్ర ఎప్పుడు స్టార్‌ అవుతుందంటే..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల అక్టోబర్ 1నుండి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర సార్ట్ కానుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో జనసేనాని దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ జనసైనికుల్లో జోష్ పెంచుతున్నారు.

New Update
Pawan Kalyan: పవన్ 4వ విడత వారాహి షెడ్యూల్ ఫిక్స్..యాత్ర ఎప్పుడు స్టార్‌ అవుతుందంటే..?

Pawan Kalyan varahi @4: జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) 4వ విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల అక్టోబర్ 1నుండి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర సార్ట్ కానుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో జనసేనాని దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ జనసైనికుల్లో జోష్ పెంచుతున్నారు.

అక్టోబర్ 1నుండి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర మొదలు కానుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా లోని అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా వారాహి యాత్ర కొనసాగనున్నంది. యాత్రలో భాగంగా మూడు నియోజకవర్గాల్లో సభలు, ఒక నియోజకవర్గంలో భారీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో తాజా,మాజీ మంత్రులు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసైనికులు.  రిసెంట్ గా తిరుపతిలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల అంతర్గత సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు (janasena nagababu) పాల్గొని పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు.

పొత్తులో భాగంగా ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో టీడీపీ పాల్గొంటుందా? లేదా అనే దాని పై సస్పెన్స్  నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు జనసేనాని గట్టి ప్లాన్స్ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే, చంద్రబాబు అరెస్ట్ కు టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో సైతం జనసైనికులు పాల్గొంటున్నారు.

వారాహి యాత్రతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనను ఎండ గడుతూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కాగా, టీడీపీతో పొత్తు ఉంటుందని డిక్లేర్ చేసిన తర్వాత చేపడుతున్న మొదటి వారాహి యాత్ర కాబట్టి టీడీపీ వర్గాలు కూడా పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వారాహి యాత్ర 4 కు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈసారి పవన్ ఏ అంశంతో వైసీపీపై విమర్శనాస్త్రాలు చేస్తారో అంటూ జనసేన శ్రేణలు, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు టీడీపీ-జనసేన కలసి పోటీ చేస్తే వైసీపీకి ఓటమి తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: చంద్రబాబుకు దొరకని రిలీఫ్.. రేపు మెన్షన్ చేయాలన్న సుప్రీం ధర్మాసనం..

Advertisment
Advertisment
తాజా కథనాలు