AP: ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన.. షెడ్యూల్ ఖరారు

ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. మూడు దశలుగా సాగనున్న ఈ పర్యటనలో ఫిబ్రవరి 14 నుంచి 17వ వరకూ రెండు జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు.

New Update
AP: ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన.. షెడ్యూల్ ఖరారు

Amaravati: జనసేన (Jenasena) పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Pavan kalyan)ఈ వారం ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. కాగా ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 14 నుంచి 17వ వరకూ రెండు జిల్లాల్లో పవన్ పర్యటించనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మూడు దశలుగా..
ఈ మేరకు పవన్‌కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఇందులో భాగంగా పవన్ తొలిరోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొననుండగా.. తొలి దశలోనే ముఖ్య నాయకులతో సమావేశాలు జరగనున్నాయి. రెండో పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు, వీర మహిళల సమావేశాల్లో పాల్గొంటారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టే నాటికి పవన్‌ మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్లే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధం చేశారు. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో పాటు టీడీపీ నాయకులతోనూ పవన్‌ సమావేశం కానున్నారు.

ఇది కూడా చదవండి : Bollywood: 17 ఏళ్లకే ఊహించని సవాళ్లు ఎదుర్కొన్నా.. మౌనీ రాయ్ ఎమోషనల్

ఇరు పార్టీల నాయకులతో..
అలాగే నియోజకవర్గాల స్థాయిలో ఇరుపార్టీల నాయకులు శ్రేణుల మధ్య స్నేహపూరితమైన వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల లక్ష్యంగా భేటీలు జగుతాయని పార్టీ నాయకులు వెల్లడించారు. ఇక ఏపీలో మరో రెండు నెల్లో ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలన్నీ సీట్ల సర్దుబాటు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర తొలి విడత, రెండో విడత దాదాపు పూర్తి చేశారు. మరోవైపు పార్టీలో చేరికలపై సైతం పవన్ దృష్టిపెట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు